ముఖ్యమంత్రికి పబ్లిక్ గా ముద్దు పెట్టిన మహిళ!

Woman Kisses Karanataka CM, Woman Kisses Chief minister Siddaramaiah, Woman Kisses CM  Siddaramaiah,  Woman Kisses CM in Publicసాధారణంగా సినీ సెలబ్రిటీలు అంటే ప్రేక్షకులకు కాస్త యావ ఎక్కువ. వారిని తాకాలని, ఓ ఫోటో దిగాలని, లక్ ఉంటే ఓ ముద్దు ఇలా… ఒక్కొక్కరికి సినిమా వాళ్ళపై రకరకాల అభిప్రాయాలు కలగడం సహజమే. అయితే కర్ణాటకలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ బహిరంగ సభలో ఓ మహిళ ఏకంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ముద్దు పెట్టి సంచలనం సృష్టించింది.

చిక్ మగళూరు జిల్లా, తరికేరే పంచాయితీ మహిళా సభ్యురాలైన గిరిజా శ్రీనివాస్ ఓ భారీ బహిరంగ సభలో ఉన్నట్లుండి సభా వేదికపైనే సిఎం సిద్ధరామయ్య బుగ్గ మీద ముద్దు పెట్టేసింది. ఊహించని ఈ పరిణామంతో వెనుక ఉన్న స్థానిక కార్యకర్తలంతా నవ్వులు చిందించగా, సిఎం ముఖంలో కూడా చిరు దరహాసం ప్రత్యక్షమవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా సిఎంతో ఫోటోలకు కూడా ఫోజులిచ్చింది సదరు మహిళా కార్యకర్త.

ADVERTISEMENT

మొదటిసారి సిఎంను కలవడంతో సంతోషం పట్టలేక, తన తండ్రి లాంటి వాడైన సిఎంను ముద్దు పెట్టుకున్నాను అంటూ ఆ తర్వాత గిరిజా సంజాయిషీ ఇచ్చుకున్నప్పటికీ, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మహిళ ముద్దు పెడుతున్నా సిఎం వారించకపోవడం ఒకటైతే, ఒక రాజకీయ వేదికలపై ఇలా ముద్దుల వేడుకలు ఏంటీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ADVERTISEMENT
Latest Stories