చెత్త సినిమా… చెత్త హీరో… చెత్త హీరోయిన్…!

worst cinema worst hero worst heroineసినీ ప్రేక్షకుల నుంచి వచ్చిన ఓట్ల ఆధారంగా, చెత్త సినిమాలు, చెత్త ప్రదర్శనలకు అవార్డులను ఇస్తూ జరిగే ‘గోల్డెన్ కేలా’ 8వ విడత అవార్డుల కార్యక్రమం జరుగగా, భారత బాంబే వెల్వెట్, షాన్ దార్, తేవర్, సింగ్ ఈజ్ బ్లింగ్ తదితర ఫ్లాప్ చిత్రాలను వెనక్కు నెట్టి, షారూక్ ఖాన్, కాజోల్ కలిసి నటించిన ‘దిల్ వాలే’ సినిమా 2015 సంవత్సరానికి గాను అత్యంత చెత్త చిత్రంగా నిలిచింది.

ఇదే సమయంలో ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమాకు గానూ హీరోయిన్ సోనమ్ కపూర్ చెత్త నటిగా ఎంపిక కాగా, దర్శకుడు సూరజ్ బర్ జాత్యా చెత్త దర్శకుడిగా నిలిచారు. ఇక చెత్త నటుడిగా సూరజ్ పాంచోలీకి సినీ అభిమానులు ఓట్లేశారు. ఈ సంవత్సరపు చెత్త గీతంగా కూడా “ప్రేమ్ రతన్ ధన్ పాయో” టైటిల్ సాంగ్ ఎంపికైంది. వీటితో పాటు పలు విభాగాల్లో ‘చెత్త’ అవార్డులను గోల్డెన్ కేలా ప్రకటించింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories