టీజర్ కు టెంప్టింగ్ పోస్టర్ రిలీజ్!

Yedu Chepala Katha Movie poster talkప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ‘మీటూ’ ఉద్యమం ఊపేస్తోంది. గతంలో తమకు జరిగిన అనుభవాలను ప్రస్తావిస్తూ ‘మీటూ’ పేరుతో పలువురు దిగ్గజ మహిళలు బయటపెడుతోన్న అంశాలు బాహ్యా ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నాయి. అయితే ఇది నాణానికి ఒక వైపే, మరోవైపు తెలుసుకోవాలంటే తమ సినిమా చూడాల్సిందే అంటున్నారు “ఏడు చేపల కధ” చిత్ర బృందం.

[m9ad]

ADVERTISEMENT

ఇప్పటివరకు పురుషులు మహిళలను వేధించడం విన్నాం, కానీ మహిళలు పురుషులను వేధిస్తే ఎలా ఉంటుందో అన్నదే ఈ “ఏడు చేపల కధ.” దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేయగా, తాజాగా టీజర్ ను రిలీజ్ చేసే డేట్ ను ఫిక్స్ చేసి మరో పోస్టర్ ను విడుదల చేసారు. హీరోయిన్ బ్యాక్ లెస్ ను చూపిస్తూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ యూత్ ను ఆకర్షిస్తోంది.

ఈ ‘ఎ’ సర్టిఫికేట్ పోస్టర్ల ప్రస్తానాన్ని శుక్రవారం నాటి టీజర్ తో పతాక స్థాయికి తీసుకెళ్లబోతున్నారు. శుక్రవారం నాడు సాయంత్రం 5.01 నిముషాలకు ఈ టీజర్ ప్రేక్షకులను పలకరించనుంది. అడల్ట్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాను శ్యాం జే చైతన్య దర్శకత్వం వహించగా, పోస్టర్స్ లో కనిపిస్తోన్న టెంప్ట్ రవి ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషించాడు.

ADVERTISEMENT
Latest Stories