గడ్డం తీసేసిన ‘యంగ్ టైగర్’ న్యూ లుక్!

young-tiger-new-lookగత ఏడాది కాలంగా “నాన్నకు ప్రేమతో” సినిమా కోసం గెటప్ మార్చి గడ్డంతో దర్శనమిచ్చిన ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్, ఇక ఆ అవతారం చాలించారు. త్వరలో ప్రారంభం కాబోతున్న కొరటాల శివ చిత్రం కోసమో లేక కాస్త రిలీఫ్ కోసమో గానీ… త్వరలో బుల్లితెరపై దర్శనమివ్వనున్న “మీలో ఎవరు కోటీశ్వరుడు” కార్యక్రమం కోసం ‘యంగ్ టైగర్’ కొత్త లుక్ లో కనిపించారు.

అన్నపూర్ణ స్టూడియోలో వేసిన “మీలో ఎవరు కోటీశ్వరుడు” సెట్ లో బుధవారం నాడు పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ గడ్డం, మీసాలు తీసేసి ‘బృందావనం’లో ఎన్టీఆర్ మాదిరి కనపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ‘బుడ్డోడు’ అభిమానులు ఈ ఫోటోను షేర్ చేసుకుంటూ “నాన్నకు ప్రేమతో” సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories