చంద్రబాబు కేంద్రంపై పోరాటం అంటే వైకాపాకు ఎందుకు ఉలికిపాటు?

YS Jagan comments on Chandrababu naidu Dharma Porata Deekshaనేడు తిరుపతిలో తెలుగు దేశం పార్టీ తలపెట్టిన ధర్మపోరాట దీక్షకు వ్యతిరేకంగా వైకాపా విశాఖపట్నంలో వంచన వ్యతిరేక దీక్ష అని కూర్చున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం అంటూ నేతలు విసుర్లు మొదలు పెట్టారు. ప్రత్యేక హోదా కోసం తాము నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు.

ADVERTISEMENT

ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ధర్మపోరాటం అంటూ తిరుపతిలో దీక్షకు దిగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు దీక్షలకు పూనుకోవడం అధికారం కోసం వేస్తున్న ఎత్తుగడలే తప్ప మరొకటి కాదని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు. ధర్మపోరాట దీక్షతో కేంద్రంపై పోరాడతాం అని చంద్రబాబు అంటే వైకాపాకు బాధ ఏంటో?

సహజంగా మోడీకి వ్యతిరేకంగా దీక్ష అంటే ఉలిక్కిపడాల్సింది బీజేపీ నాయకులు. బీజేపీతో ఏ సంబంధం లేని వైకాపాకు అంత బాధ ఏంటి? ఇటువంటి కార్యక్రమాల వల్ల బీజేపీ అనుకూల పార్టీ అనే ముద్ర పడదా? బీజేపీ నాయకులే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకుండా ఊరుకున్నారు వైకాపా నాయకులు మాత్రం మోడీని కాపాడటానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు అని టీడీపీ నాయకుల ఆరోపణ.

ADVERTISEMENT
Latest Stories