వివిధ సంక్షేమ కార్యక్రమాల పేరిట ప్రభుత్వ ఖజానాను గుల్ల చేస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏడాదిలో చెయ్యాల్సిన అప్పుడు నాలుగు ఐదు నెలలోనే అవ్వగొట్టేసి… ఇప్పుడు మరిన్ని అప్పుల కోసం కేంద్రం వైపు చూస్తుంది. ఇటీవలే అప్పుల పరిమితిని పెంచుకోవడానికి కేంద్రం పెట్టిన కండిషన్లను కూడా ఒప్పుకుంది.
దీనిలో భాగంగా అన్ని వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు డిజిటల్ మీటర్లను బిగించాల్సిన పరిస్థితి. దీనితో రైతులలో అనుమానాలు నెలకొన్నాయి. తామకు ఇచ్చే ఉచిత విద్యుత్తు భవిష్యత్తులో ఉండే అవకాశం లేదని వారి ఆందోళన చెందుతున్నారు. అయితే రైతులకు బిల్లుల సొమ్ము ఆ తరువాత చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతుంది.
గతంలో అంటే 2004లో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రావడానికి రైతులకు ఉచిత విద్యుత్తు ఎంతో కీలక పాత్ర పోషించింది. ఆ విషయం జగన్ కు బాగా తెలుసు. దానితో రైతుల అపోహలు… ప్రతిపక్షాల వాదనలు వారిలోకి వెళ్తే తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం భయపడుతుంది.
అయితే నిపుణులు మాత్రం పరిస్థితులు అంత తేలికగా ఉండవు అని అంటున్నారు. “ఒకసారి కేంద్రం స్కీం ఒప్పుకుని చేరాకా పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. వారు ఎలా నిర్దేశిస్తే అలా నడవాలి… కేంద్రం రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఎంత చెప్పినా ఇది రైతులకు ఇబ్బందే,” అని వారు అంటున్నారు.





