జగన్ కు ‘బర్త్ డే’ షాక్ తగలనుందా?

ys-jagan-happy-birthday-uppuleti-kalpana-join-tdpపుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృష్ణాజిల్లా ఎమ్మెల్యే ఓ షాక్ ఇవ్వనుందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కృష్ణాజిల్లా, పామర్రు నియోజకపు వర్గం ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అధికార తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకోబోతున్నారని తెలుస్తోంది. జగన్ పుట్టినరోజే చేరకపోవచ్చు గానీ, ఈ వారంలోనే పార్టీ మార్పుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లుగా సమాచారం.

2004లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆమె, ఆ సంవత్సరం నిడుమోలు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆపై 2009లో పామర్రు నుంచి అదే పార్టీ తరఫున ఓడిపోయిన ఆమె, 2013లో వైకాపాలో చేరి, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యను ఓడించారు. అయితే గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఉప్పులేటి, ఇటీవల జరిగిన బెల్ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబుతో కలసి పాల్గొన్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

దీంతో అప్పటినుండి పార్టీ మార్పుపై ఊహాగానాలు చెలరేగిన నేపధ్యంలో… జరుగుతున్న చర్చలు సఫలీకృతం అయ్యాయని, దీంతో ‘ఉప్పు’లేటి జగన్ కు ‘ట్విస్ట్’ ఇవ్వడం ఖాయమన్న సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కల్పన ఫిరాయింపు దాదాపు ఖాయమని వైసీపీ వర్గాలు కూడా మానసికంగా ఫిక్స్ అయిపోవడంతో, కల్పన ప్రకటన వెలువడిన వెంటనే పామర్రు వైకాపా పగ్గాలు మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ కు అప్పగించేందుకు అప్పుడే పార్టీ అధినేత జగన్ సన్నాహాలు కూడా చేసుకున్నారట.

ADVERTISEMENT
Latest Stories