జగనన్న నువ్వన్నా కళ్ళు తెరువన్నా!

YS Jagan - Kodali Naniగుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ నేతలే అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మీడియాకు ఎక్కుతున్నారు. తాను వైసీపీ నేతనే, జగన్ అభిమానినే కావాలంటూ కండువా చూడండి అంటూ ప్రారంభించిన సుబ్బారావు గుప్తా, గుడివాడ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.

ADVERTISEMENT

నీ యొక్క భాష వల్ల, నీ యొక్క భావాల వల్ల, నీ యొక్క దమ్ము వల్ల, మంచితనమో, చెడుతనమో వల్ల వైఎస్సార్ పార్టీ ఓట్లు రోజూ పోతున్నాయి. మేమేడ లెక్కేస్తాం? జగనన్న ఓ నాలుగు శాతం పెంచితే, ఈయనొక 40 శాతం పోగొట్టేటట్టు ఉన్నాడు. అర్జెంట్ గా ముందు నిన్ను బహిష్కరించడమా? లేక మేము బయటకి వెళ్లిపోవడమా? అనేది నిర్ణయించుకోవాలి.

ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, పార్టీ కార్యకర్తల తరపున మాట్లాడుతున్నానని, రెడ్లు, చౌదరిలు అందరూ బాధపడుతున్నారని, కులాల ప్రస్తావన తెస్తూ కాపులు, బొండా ఉమా అని అందరిని తెగ తిడుతున్నాడు. నువ్వు సింహాల దాడి చూసుంటావు నాని, కానీ తోడేళ్ళ దాడి చూస్తావ్, అలా ఉంటది వైఎస్సార్ కార్యకర్తలు దాడి చేస్తే అంటూ హెచ్చరించారు.

నీ వలన ఓట్లు మొత్తం పోతున్నాయి. ఏం చేయాలి? జగనన్న నువ్వన్నా కళ్ళు తెరువన్నా. నువ్వు కళ్ళు తెరవకపోతే మేమంతా కళ్ళు మూసుకుని వేరే రాష్ట్రాలు వెళ్లిపోవాల్సి వచ్చేటట్లు ఉంది. పార్టీలో ఉండి ఏం చేయాలి మేము? కంట్రోల్ చేయన్నా, కంట్రోల్ చేయకపోతే, ఎలాగూ లా అండ్ ఆర్డర్ బాలేదుగా హోమ్ మినిస్ట్రీ ఇవ్వు, బాగా చేస్తాడు.

ఇంట్లో వాళ్ళని తిట్టేది ఏంటి? కులాలను తిట్టేది ఏంది? మతాలను తిట్టేది ఏంది? ఆరోగ్య శాఖా మంత్రి కూడా నానియే కదా, కాస్త దగ్గరుండి ఈయనకు వైద్యం చేపించమనండి. క్యాసినో జరగలేదంటున్నావు కదా, అలాంటప్పుడు నీకెందుకు ఇవన్నీ. వాళ్ళు ఎవరో ఎంక్వయిరీ చేస్తారు, ఉంటే నీ మీద పడుతుంది, లేకపోతే వదిలేసేయ్. ఓ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని అలా తిట్టవద్దని, ఒకవేళ నీకు చుట్టాలైతే ఇంటికి పోయి తిట్టుకో, ప్రజల్లో ఉన్నపుడు తిట్టమాకు.

బాలినేని శ్రీనివాసరెడ్డి అని మా మంత్రి ఉన్నాడు, ఆయన దగ్గరికి పోయి క్లాసులు నేర్చుకో, అండర్ గ్రౌండ్ లో ఎట్టా చేయాలో చెప్తాడు. బయట మాత్రం కమలహాసన్ యాక్షన్ చేస్తాడు. ఆయన దగ్గర నేర్చుకో కనీసం. నువ్వు చేసే దాడి ఏదో, దమ్ము ఏదో అండర్ గ్రౌండ్ లో నాలుగు గోడల రూమ్ లో కూర్చుని చెప్పు. మాకు ఎట్టా న్యాయం చేసాడో ఒంగోలులో, అలాగే నీకు కసి ఉన్నోళ్ల ఎట్టా న్యాయం చేయాలో చెప్తాడు.

నీకు షుగర్ బాగా పెరిగిపోయినట్టుంది. కావాలంటే ఒంగోలు నుండి మాత్రలు పంపిస్తా, ఉచితంగానే! ఎందుకన్నా మా పార్టీని నాశనం చేస్తున్నావు. చేతులెత్తి వేడుకుంటున్నా. అన్నా 72 గంటలు టైం ఇస్తున్నా, జగన్ అన్నా. ఈ 72 గంటల్లో నువ్వు కళ్ళు తెరువు. ఇవాళ పిల్లలు న్యూస్ ను బాయ్ కాట్ చేసేటట్టు ఉన్నారు. 2024లో గుడివాడలో నేను పోటీ చేస్తున్నాను అంటూ బల్లగుద్ది మరీ చెప్పారు వైసీపీ నేత సుబ్బారావు గుప్తా.

ADVERTISEMENT
Latest Stories