ఆపినా ఆగదు కాబట్టి వెళ్ళా… జగన్ లాజిక్ పై విశ్లేషకుల పెదవివిరుపు

YS Jagan responds on visit to Kaleshwaram project inaugurationకాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్లారనే దాని పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్లాలని ప్రతిపక్షం అడుగుతోంది. పొరుగు రాష్ట్రాలతో మంచిగా ఉండాలనే వెళ్లాను. ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారు. అక్కడ కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాశారా?,” అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

ADVERTISEMENT

అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి సమాధానం కొంత చిత్రంగానే ఉంది. చంద్రబాబు ఏమీ చెయ్యలేకపోయాడు… అప్పట్లో గాడిదలు కాసారనే ఇంట్లో కూర్చోబెట్టారు ఓటర్లు. అయితే ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం జగన్ పోరాడాలనే కదా ప్రజలు కోరుకునేది. సరే పూర్తి అయిపోయిన ప్రాజెక్టు పై ఇప్పుడేం పోరాడతారు గాని… సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి నష్టం చేసే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లి అక్కడ కొబ్బరికాయ కొట్టి ఏం మెస్సేజ్ ఇస్తున్నట్టు?

పూర్తి అయిపోయిన ప్రాజెక్టును ఆపలేకపోవచ్చు కనీసం దాని వల్ల మనకు నష్టం అనే మాట మీద ఉండాలి కదా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశాల హృదయంతో ఓ అడుగు ముందుకేసి తన రాష్ట్రం నుంచి నీళ్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని జగన్ శాసనసభ సాక్షిగా చెప్పారు. రేపు కేసీఆర్ తరువాత వచ్చే ముఖ్యమంత్రికి అంత విశాల హృదయం లేకపోతే? పూర్తిగా తెలంగాణా భూభాగంలో ఉండే ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ఏం చేసుకుంటుంది? అసలు పూర్తి స్థాయిలో ప్రాజెక్టు డీపీఆర్ కూడా తయారు కాకముందే అసెంబ్లీ సాక్షిగా పొగిడెయ్యడం ఏంటి అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories