షర్మిల: సజ్జల అయినా జగన్ అయినా సేమ్ రిప్లై! ఓకేనా!

YS Sharmila

షర్మిల తెలంగాణ ఎన్నికలలో పోటీని విరమించుకుని కాంగ్రెస్ పార్టీకి తన మద్దతు తెలియచేసిన నాటినుండి నేటి వరకు ఏదోఒక వార్తతో మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. వైస్ కుటుంబాన్ని ఇబ్బందిపెట్టిన కాంగ్రెస్ కు షర్మిల మద్దతు తెలపడాన్ని తప్పుపట్టిన సజ్జలకు కౌంటర్ వేశారు వైస్ షర్మిలా.

తాజా రాజకీయాల పై స్పందిస్తూ మీడియా ముందుకొచ్చిన వైస్ షర్మిలను తెలంగాణలో మీ నిర్ణంయం పై సజ్జల చేసిన వ్యాఖ్యలకు మీ రిప్లై ఏంటి అంటూ ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సజ్జల స్టైల్ లోనే జవాబిచ్చారు షర్మిల. నేను తెలంగాణ రాష్ట్రంలో వైస్సార్టీపీని ఏర్పాటు చేసిన తొలి రోజునే ఆమెకు మాకు సంబంధం లేదు అంటూ చెప్పిన సజ్జల ఇప్పుడు ఏ సంబంధం ఉందని నా గురించి మాట్లాడుతున్నారు అంటూ కౌంటర్ వేశారు.

ADVERTISEMENT

మా వరకు అయితే మీరు చెప్పినట్టే సంబంధం లేదనే అనుకుంటున్నాం.ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే మళ్ళీ సంబంధం కలుపుకోవాలని ఆశపడుతున్నారా? దీని గురించి సజ్జలే సమాధానం చెప్పాలి అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలకు ఎదురు ప్రశ్న వేశారు షర్మిల. దీనిపైన సజ్జల ఎలా స్పందిస్తారో, షర్మిలకు ఎటువంటి జవాబిస్తారో చూడాలి మరి.

అసలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగానే డబుల్ రోడ్ అయితే తెలంగాణ అదే సింగల్ రోడ్ అయితే ఆంధ్రా.., చీకటయితే ఆంధ్రా,వెలుగైతే తెలంగాణ అంటూ చేసిన వ్యాఖ్యలకి ముందు సమాధానం చెప్పండి. మీ సంగతి మీరు చూసుకోండి మా గురించి మాకు తెలుసు అంటూ కాస్త ఘాటుగానే బదులిచ్చారు వైస్ షర్మిల. ఈ సమాధానం సజ్జలకేనా…లేక ఏపీ ముఖ్యమంత్రికి కూడానా అన్న ఆప్రశ్నకు ఎవ్వరికైనా ఇదే రిప్లై ఓకేనా అంటూ వెళ్లిపోయారు షర్మిల.

ADVERTISEMENT
Latest Stories