వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. వెంటనే వారిద్దరి ఫోటోతో సాక్షి మీడియా ‘బాబుతో చెట్టా పట్టాల్’ అంటూ నెటిజన్స్ పేరుతో తన ఆక్రోశం బయటపెట్టుకుంది. ఊహించినట్లే సాక్షి కథనంపై విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే ‘రవి గాంచని చోటుని కవి గాంచున్,’ అన్నట్లుగా మీడియా కూడా గమనించని ఓ విషయాన్ని వైఎస్ షర్మిల గమనించి, ‘బాబుతో చెట్టా పట్టాల్’ అని హెడ్డింగ్ పెట్టి తండ్రి వయసున్న సీఎం చంద్రబాబు నాయుడుకు పెళ్ళి పత్రిక ఇచ్చేందుకు వెళ్తే, సొంత చెల్లెలు గురించి ఇంత నీచంగా వ్రాయిస్తావా? అంటూ ఆమె సాక్షి కథనాన్నిట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలోనే జగనన్నపై నిప్పులు చెరిగారు.
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పిల్లల పెళ్ళిళ్ళకు చంద్రబాబు నాయుడుతో సహా ప్రతిపక్షనాయకులను కలిసి ఆహ్వానించ లేదా? అంత మాత్రాన్న వారితో కలిసిపోయరా? నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం ఇది. వైసీపీ అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట. జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. ఇలాంటి రోతరాతలు వ్రాయించడం మానుకోవడం లేదంటూ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు.
ఆమె దెబ్బకు వెంటనే సాక్షిలో ‘బాబుతో చెట్టాపట్టాల్’ టైటిల్‌ను ‘షర్మిల ద్వంద రాజకీయ వైఖరిపై సోషల్ మీడియాలో చర్చ! అని మార్చారు. కానీ అదే స్టోరీ… నెటిజన్స్ పేరుతో అవే ఏడ్పులు.
గతంలో కూడా ఒకసారి ‘వైఎస్ షర్మిల పసుపు చీర కట్టుకున్నారంటూ’ మాట్లాడి జగన్ ఇలాగే దొరికిపోయారు. ‘సొంత చెల్లి కట్టుకున్న చీర గురించి మాట్లాడుతావా? ఇదేనా నీ సంస్కారం?’ అంటూ నాడు వైఎస్ షర్మిల నిప్పులు చెరగడంతో జగన్, ఆయన సైన్యం సైలంట్ అయిపోయారు. మళ్ళీ ఇంతకాలం తర్వాత సాక్షి ‘టైటిల్’ కారణంగా మరోసారి ఆమెకు దొరికిపోయారు.
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ?
నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట.
@ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు.
ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే… సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ?
నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే
రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది.ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ?
వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి.
ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
— YS Sharmila (@realyssharmila) November 17, 2026





