షర్మిలకు అసలైన పరీక్ష ఇప్పుడే

YS Sharmila tough timeతెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఉన్నఫళంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఆంధ్ర సెంటిమెంట్ రేకెత్తించే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం ఆంధ్ర వాళ్ళని, అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని తిట్టినతిట్టకుండా తిడుతున్నారు మంత్రులు. ఒక మంత్రి వైఎస్ దొంగ అంటే ఇంకో మంత్రి నరరూపరాక్షసుడు అన్నారు.

ADVERTISEMENT

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. మరోవైపు… తెలంగాణలోని ఈ వాతావరణంతో ఒక్కసారిగా అందరి చూపు షర్మిల వైపుకు మళ్లింది. ఈ విషయంలో అన్నను తప్పు పెట్టి గట్టిగా తెలంగాణ వైపు మాట్లాడితే గానీ రాజకీయంగా ఆమెకు ఉపయోగం ఉండదు.

అయితే వైఎస్ ని తిడుతున్న తెరాస మంత్రులకు కూడా ఆమె ఎదురుకోవాలి. అయితే వైఎస్ ని తిడుతున్న వారిని తిట్టి… తండ్రిని తిడుతున్నా మౌనంగా ఉండిపోతున్న అన్న మీద కూడా తిరగపడితే షర్మిల పార్టీకి రాజకీయంగా కలిసిరావచ్చు. అయితే అన్నను మరీ తిట్టినా రెడ్లు దూరం కావొచ్చు అనే అనుమానం కూడా ఉంటుంది.

షర్మిలను ఆంధ్ర ఆడపడుచు అని విమర్శిస్తున్న వారికి తాను తెలంగాణ కోడలిని అని చెప్పుకొస్తున్నారు. అయితే ఆంధ్ర-తెలంగాణ నీటి తగాదాలో తెరాసకు సమానంగా నిలబడి ఆంధ్రని విమర్శిస్తేనే షర్మిల తన పై వస్తున్న నాన్ లోకల్ ముద్రను తుడిచేసుకోగలరు. రాజకీయంగా అత్యంత అప్రమత్తత తో వ్యవహరించాల్సిన సమయమిది ఆమెకు.

ADVERTISEMENT
Latest Stories