గత కొద్దికాలంగా వైస్ కుటుంబంలో జరుగుతున్న అన్న చెల్లెళ్ళ ఆస్తి పంపకాల వివాదం ముదిరి పాకాన పడడంతో ఇక ఈ వివాదంలోకి తల్లి విజయమ్మ కూడా ప్రవేశించక తప్పలేదు. తన అంగబలం అర్ద బలంతో ఈ వివాదంలో షర్మిలను ఒంటరిని చేసి జగన్ ఆడుతున్న ఈ జగన్నాటకానికి తెర దింపడానికి వైస్సార్ సతీమణి వైస్ విజయలక్ష్మి తెలుగు ప్రజలతో పాటుగా వైస్సార్ అభిమానులకు కూడా బహిరంగ లేఖ విడుదల చేసారు.
ఈ లేఖ సారాంశం…వైసీపీ ప్రచారం చేస్తున్నట్టుగా వైస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆస్తి పంపకాల కార్యక్రమం పూర్తి కాలేదు. జగన్ సీఎం అయిన తరువాతనే ఈ ఆస్తుల పంపకాల అంశం చర్చకొచ్చిందని, అందులో భాగంగానే ఈ MOU ఒప్పందం జరిగిందంటూ ఒక క్లారిటీ ఇచ్చారు విజయలక్ష్మి.
Also Read – అన్న అలా…చెల్లి ఇలా..!
ఇప్పుడు మీడియాలో ప్రత్యక్షమైన ఈ MOU స్వయంగా జగన్ చేతుల మీద రాసిందే, ఇందులో షర్మిలకు హక్కు ఉంది కాబట్టే ఆమెకు డివిడెండ్ల రూపంలో 200 కోట్లు ఇవ్వడం జరిగిందని, ఆ MOU ఒప్పందం ప్రకారం సరస్వతి షేర్స్ 100 %, అందులో లేని బెంగళూర్ ఎలహంక ప్యాలస్ 100 % షర్మిలకు వెంటనే ఇస్తానని జగన్ ఆ నాడు మాట ఇచ్చి సంతకం చేయడం ముమ్మాటికీ వాస్తవమే అంటూ జగన్ తన చెల్లికి చేసిన మోసాన్ని బయటపెట్టారు విజయమ్మ.
ఇక తల్లిగా తనకు జగన్, షర్మిల ఇద్దరు సమానమే అయినప్పటికీ ఒక బిడ్డ మరో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఉండలేక అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన నిలబడం ధర్మమనిపించి వైస్సార్ ను అభిమానించే వారికి నిజాలు తెలియాలనే ఉద్దేశంతో బరువెక్కిన గుండెతో ఈ లేఖ రాస్తున్నాను అంటూ విజయలక్ష్మి తన ఆవేదనను పంచుకున్నారు.
Also Read – సెలబ్రేటీలు పిలిచినా రారు!… అవును ఎందుకు రావాలి?
అలాగే వైస్సార్ బతికి ఉన్న రోజులలో ఎంతో ప్రేమ, అన్యోన్య తతో ఉండే మా కుటుంబం ఇప్పుడు ఇలా ఆస్తుల కోసం రోడ్డుకెక్కడం వెనుక ఎవరి ‘దిష్టి’ తగిలిందో అంటూ తన బాధాతప్త హృదయాన్ని ఆవిష్కరించారు విజయమ్మ. అయితే ఈ వివాదానికి కారణం ఎవరి దిష్టో కాదు తల్లి జగన్ చర్యలతో మూగవేదన అనుభవించిన ఎన్నో కుటుంబాల ‘కన్నీటి ఉసురు’ ఇప్పుడు వైస్ కుటుంబానికి శాపంలా మారింది అనే అభిప్రాయం గట్టిగా వినపడుతుంది.
వైసీపీ ప్రభుత్వంలో జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో దాదాపు ఐదేళ్లు రాజధానికి భూములిచ్చిన రైతు కుటుంబాలు కన్నీటితో కాలం గడిపి కష్టాలతో సావాసం చేసారు. వారి జీవితకాల కష్టం, పిల్లల భవిష్యత్, వారసత్వంగా వచ్చిన ఆస్తి కళ్ళ ముందే సమాధిగా మారిపోతుంటే ఆ కుటుంబాలు కార్చిన కన్నీటి ఉసురు ఇప్పుడు వైస్ కుటుంబాన్ని తాకదా.?
Also Read – భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తుందేవరు..?
మాకు మాస్కులివ్వండి మహాప్రభో అని అడిగిన పాపానికి ఒక తల్లికి తన బిడ్డను పిచ్చివాడిగా ముద్రించి అప్పగించిన వైనం , ఆ వ్యక్తి చావుకు కారణమైన పాపం ఇప్పుడు ఏ తల్లికి శాపంగా మారిందో తెలుస్తుందా.? ప్రత్యర్థిని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి వారి కుటుంబంలోని మహిళలను బహిరంగ వేదికలెక్కించిన పాపం, నిండు శాసన సభలో అవమానించిన ఘోరానికి ఆ కుటుంబాల ఉసురు ఈ కుటుంబానికి చేరదా.?
వివేకా గొడ్డలి వేటుకు కారణం ఎవరు అంటూ ఆ కుటుంబం పడ్డ మానసిక రోధనకు మూల్యం చెల్లించేదెవరు.? వీరంతా కూడా జగన్ తీసుకున్న నిర్ణయాలు వలనో, జగన్ వహించిన మౌనం వలనో కుటుంబాలను కోల్పోయాని వారే. మరి వారి కుటుంబాల ఉసురు ఇప్పుడు జగన్ కుటుంబాన్ని వెంటాడవా.? ఒక్కసారి మనసుతో మానవత్వంతో ఆలోచిస్తే జగన్ చేసిన అరాచకాలు కళ్ళ ముందు సాక్ష్యాలుగా మిగిలే ఉన్నాయి.
పదవి కాంక్షతో, అధికార అహంకారంతో, డబ్బు మీద ఆశతో జగన్ చేస్తున్న ఈ చర్యలతో చనిపోయిన వైస్ రాజశేఖర్ రెడ్డి ఈ ఘోరాలు చూసే అవకాశం లేక బతికి పోయారు..కానీ బతికున్న తల్లి విజయలక్ష్మి మాత్రం ఈ దారుణాలకు సాక్షిగా మిగిలి జీవత్సవం లా మిగిలిపోయారు. మరి ఇప్పుడు ఈ తల్లి, ఆ చెల్లి కారుస్తున్న కన్నీటి ఉసురు జగన్ ను ఏస్థాయికి దిగజారుస్తుందో కాలమే బదులివ్వాలి.