వైసీపీ మేయర్ అభ్యర్ధి ప్రకటన దూకుడా.. తప్పటడుగా?

YSRCP Announces Nellore Mayor Pick Before Reservation Is Set

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించిన వైసీపీ, కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తుండటమే విడ్డూరం అనుకుంటే, ఈ ఎన్నికలకు ప్రభుత్వం ఇంకా రిజర్వేషన్లు ఖరారు చేయక మునుపే నెల్లూరు మేయర్ అభ్యర్ధిగా అనం విజయ్‌ కుమార్‌ రెడ్డి పేరు ప్రకటించడం ఇంకా విడ్డూరం.

ఈ ప్రకటనను వైసీపీ సొంత మీడియా, సోషల్ మీడియా ‘దూకుడు’ అని గొప్పగా చెప్పుకుంటోంది. కానీ దూకుడు కాదు తప్పటడుగు అని చెప్పాలి. ఎందుకంటే, మున్సిపల్ ఎన్నికలలో ప్రభుత్వం మేయర్, డెప్యూటీ మేయర్‌ పదవులతో సహా కౌన్సిలర్ పదవులకు రిజర్వేషన్స్ ప్రకటిస్తుంది.

ADVERTISEMENT

స్థానిక, మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ సత్తా నిరూపించుకోవాలనుకోవడం మంచిదే. కానీ ప్రభుత్వం రిజర్వేషన్స్ ఖరారు చేసేవరకు ఆగాలి కదా?ఒకవేళ ఆలోగా అభ్యర్ధులను ఖరారు చేసుకున్నా రిజర్వేషన్స్ ఖరారు కాక ముందే అభ్యర్ధిని ప్రకటించకుండా వేచి చూడాలి కదా?

ఒకవేళ ప్రభుత్వం నెల్లూరు మేయర్ పదవిని బీసీలకు లేదా ఎస్సీ మహిళకు కేటాయించవచ్చు. అప్పుడు నవ్వుల పాలయ్యేది అనం విజయ్‌ కుమార్‌ రెడ్డి, ఆయనని అభ్యర్ధిగా ప్రకటించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే కదా?మరి దూకుడనుకోవాలా లేక తొందరపాటు అనుకోవాలా?

సర్లే!వసంతకాలం ఆలస్యమైతే కోయిల తొందరపడి ముందే కూసిందని నిందిస్తే ఎలా?

ADVERTISEMENT
Latest Stories