ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న పెన్షన్ దారుల పునర్పరిశీలన ప్రకంపనలు సృష్టిస్తుంది. అనేక కొత్త రూల్స్ తో ఎన్నో ఏళ్లుగా పెన్షన్లు నిజమైన లబ్దిదారులకు ఈ సారి పెన్షన్ తీసేశారు. దీనితో వారు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 10న పెన్షన్ దారులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.
దీనితో ప్రభుత్వం వెంటనే అలెర్ట్ అయ్యింది. తంలో పెన్షన్లు అందుకున్న వారిలో 4,16,034 మంది అనర్హులు..ఈ అనర్హుల జాబితాపై ప్రభుత్వం పునః సమీక్షిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. అనర్హుల జాబితాలో ఎవరైనా అర్హులు ఉంటే వారిని పరిగణనలోకి తీసుకుంటాం..అర్హులుగా తేలిన వారికి గత నెల పెండింగుతో కలిపి రెండు నెలల పెన్షన్ ఇస్తాం అని ప్రకటించారు.
“300 యూనిట్లు ఉన్న అనర్హుల జాబితాలో 8900 మంది ఉన్నారు.. ఈ జాబితాను పునః సమీక్షిస్తున్నాం..పేదలు చంద్రబాబు మాటలు నమ్మొద్దు,” అంటూ ఆయన పిలుపునిచ్చారు. అయితే చంద్రబాబు ప్రకటనతో జగన్ ప్రభుత్వం దిగివచ్చిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం ఉదృతం చేస్తామని అంటున్నారు.
చంద్రబాబు హయాంలో 2000 రూపాయిలు ఉన్న పింఛన్ ను జగన్ అధికారంలోకి వచ్చాకా 2250 రూపాయలకు పెంచారు. వచ్చే ఎన్నికల నాటికి 3000 రూపాయిలు చేస్తామని ప్రకటించారు. ఈ పెంపు ఆర్ధిక భారం కావడంతో అనేక కండిషన్స్ తో లబ్ధిదారుల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.





