శవ రాజకీయాలకు ఆవులైనా ఓకే!

YSRCP Dirty Politics on TTD Goshala

తిరుమలలో రాజకీయాలు చేసినవారందరూ నష్టపోయారు. భారీ మూల్యం కూడా చెల్లించారని తెలిసి ఉన్నా వైసీపీ రాజకీయాలు చేస్తూనే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

అదీ.. టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి చేస్తుండటం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. టీటీడీ గోశాలలో ఆవులు చనిపోతున్నాయంటూ ఆయన రాజకీయాలు మొదలుపెట్టడంతో టీడీపీ ఛైర్మన్‌, ఈవో ఖండించారు. మీడియా ప్రతినిధులను తీసుకువెళ్ళి గోశాలలో ఆరోగ్యంగా ఉన్న ఆవులు, దూడలను చూపించారు.

ADVERTISEMENT

అయినా భూమన కరుణాకర్ రెడ్డి పదేపదే సవాళ్ళు చేస్తుండటంతో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆయన సవాలుని స్వీకరించి ఇవాళ్ళ ఉదయం గోశాలకు రావాలని ప్రతి సవాలు విసిరారు.

పోలీసులు తనని అడ్డుకుంటారని భూమన కరుణాకర్ రెడ్డి అనుకుంటే పోలీసులు ఆయనని అనుమతిస్తున్నట్లు ప్రకటించడంతో గోశాలకు బయలుదేరక తప్పలేదు.

కానీ ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి ఏవిదంగా తప్పించుకోవచ్చో వైసీపీ నేతల కంటే ఎవరికి బాగా తెలుసు?కనుక భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో తన నివాసం నుంచి సుమారు 2,000 మందిని వెంటబెట్టుకొని గోశాలకు బయలుదేరారు.

ఆయన ఊహించిన్నట్లే పోలీసులు వారిని అడ్డుకొన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి, మరో ముగ్గురు ముఖ్య నేతలను మాత్రమే అనుమతిస్తామని చెప్పి వారిని అడ్డుకున్నారు. వారు కూడా అదే కోరుకుంటున్నారు.. కనుక భూమన కరుణాకర్ రెడ్డి రోడ్‌పై పడుకొని డ్రామా మొదలుపెట్టేశారు.

మాజీ మంత్రి రోజా ఆయన పక్కనే కూర్చొని పోలీసులపై విరుచుకు పడ్డారు. గోశాలకు రమ్మనని ఫోన్లు చేసి పోలీసులతో అడ్డుకుంటారా?మమ్మల్ని ఎదుర్కోలేకనే పోలీసులతో అడ్డుకుంటున్నారని రోజా ఆరోపించారు.

మరోపక్క భూమన కరుణాకర్ రెడ్డి కోసం ఎదురుచూస్తున్న టీడీపీ ఎమ్మెల్యేల వద్దకు వైసీపీ ఎంపీ గురుమూర్తి వచ్చి వారితో వాగ్వాదానికి దిగారు.

గోశాలలో ఆవులు చనిపోతుంటే అందుకు ఎవరైనా బాధపడతారు. కానీ మనుషులతో శవ రాజకీయాలు చేసే వైసీపీ నేతలు, ఆవులతో కూడా శవరాజకీయాలు చేస్తుండటమే దిగ్బ్రాంతి కలిగిస్తుంది.

రేపు రోడ్‌పై ఏ కుక్కో, పిల్లో చనిపోయినా దానికీ కూటమి ప్రభుత్వం, సిఎం చంద్రబాబు నాయుడే కారణం అంటూ ఇలాగే శవ రాజకీయాలు చేస్తారేమో?అయినా టీటీడీ ఛైర్మన్‌గ పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తూ తిరుమల ప్రతిష్టకు భంగం కలిగిస్తుండటం చాలా శోచనీయం.

ADVERTISEMENT
Latest Stories