వైసీపీ డీఎస్సి నిరసనలు…భక్తి లేని భజనేనా.?

YSRCP DSC Protests: Will They Gain Public Support?

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపడుతున్న డీఎస్సి నిరసన కార్యక్రమాలు భక్తి లేని భజన మాదిరి చప్పగా సాగుతున్నాయి. డిఎస్సి లో అక్రమాలు – మంత్రి నారా లోకేష్ రాజీనామా అంటూ సాగుతున్న వైసీపీ ర్యాలీలలో ఎక్కడ ప్రజా మద్దతు లభించడం లేదు అనిపించేలా కార్యక్రమాలు ముందుకెళుతున్నాయి. కేవలం పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రమే నిరసన ర్యాలీలతో పాల్గొంటున్నారు.

అయితే కేంద్ర బీజేపీ కి వ్యతిరేకంగా సీజేపీ నిర్వహించిన నీట్ ఉద్యమం దేశ వ్యాప్తంగా జన్ జీ ల దృష్టిని ఆకర్షించింది. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా సీజేపీ చేపట్టిన నిరసన దీక్షలకు అనూహ్యమైన ప్రజా మద్దతు లభించింది. దాని ఫలితంగానే సీజేపీ ఉద్యమం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచగలిగింది, ఏకంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ను రాజీనామా చేయించగలిగింది.

ADVERTISEMENT

అయితే అక్కడ సీజేపీ ఉద్యమానికి బాధితుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. వారి ఉద్యమ కారణంలో ఉన్న చిత్తశుద్ధిని ప్రజలు స్పష్టంగా గమనించారు. కాబట్టి వారికీ ఎటువంటి రాజకీయ చరిత్ర లేకపోయినప్పటికీ వారి వెంట నడిచేందుకు యువత పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు.

కానీ నాటి సీజేపీ ఉద్యమాన్నే ఆదర్శంగా తీసుకుని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మంత్రి లోకేష్ రాజీనామ డిమాండ్ తో వైసీపీ మొదలుపెట్టిన నిరశన ర్యాలీలలో చిత్తశుద్ధి ఉందా అనేది ఇక్కడ ఎదురవుతున్న అసలు ప్రశ్న. మేము డిఎస్సి బాధితులం అంటూ ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గళం వినిపించడం లేదు.

అలాగే మంత్రి లోకేష్ రాజీనామా చెయ్యాలనే వాదన ఒక్క వైసీపీ తప్ప మరెవరు తెరమీదకు తేవడం లేదు. జెన్ జీ లంతా మా వెంటే, మా ఉద్యమానికి జెన్ జీల మద్దతు అంటూ ప్రచారం చేసుకుంటున్న వైసీపీ తమ నిరసనల ర్యాలీలతో కనీసం ప్రభుత్వంలో స్పందన తేగలిగిందా.? అసలు వైసీపీ నిరసనలను ప్రజలు పట్టించుకుంటున్నారా.? జెన్ జీ లు వైసీపీ వెంట నడిచేందుకు ముందుకొస్తున్నారా.?

ఈ ప్రశ్నలకు సమాధానాలు కూడా వైసీపీ నిరసన ర్యాలీల కార్యక్రమంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారు చేపట్టిన ర్యాలీలలో ఎక్కడ ప్రజల దృష్టిని తన వైపుకి తిప్పుకోలేకపోతున్నారు వైసీపీ నేతలు. పార్టీ జెండాలు పట్టుకుని వైసీపీ క్యాడర్, పార్టీ అధినేత ఎజెండా ను అనుసరిస్తూ పార్టీ నాయకులు రోడ్ల మీదకు వస్తున్నారు తప్ప అక్కడ ఎక్కడ సామాన్య ప్రజానీకం కనిపించడం లేదు.

కానీ వైసీపీ మాత్రం తమ పార్టీ చేపట్టిన నిరసనలకు జెన్ జీల మద్దతు లభిస్తుందంటూ ప్రచారం చేసుకుంటుంది. అయితే అసలు క్షేత్ర స్థాయిలో అటువంటి పరిస్థితితులు కనిపిస్తున్నాయా అంటే జెన్ జీ ల సంగతి అంటుంచింతే అసలు జనమే లేరు అనే వాదన రాష్ట్ర వ్యాప్తంగా బలంగా నడుస్తుంది.

ఇటు కూటమి ప్రభుత్వం సైతం వైసీపీ డిఎస్సి నిరసన ర్యాలీల పై పెద్దగా స్పందించడం లేదు. ఇక డీఎస్సి లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు వైసీపీ నిరసన ర్యాలీలకు కౌంటర్ గా కర్నూల్ కొండా రెడ్డి బురుజు సెంటర్ లో ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేస్తూ ఉద్యమించారు.

అయితే ఇలా ప్రజా మద్దతు పొందలేని వైసీపీ నిరసనలకు ప్రభుత్వం తలవంచుతుందా.? అటువంటి ఉద్యమాలతో ప్రభుత్వ పెద్దలలో వైసీపీ రాజకీయ ఒత్తిడిని సృష్టించగలదా.? వైసీపీ చేస్తున్న ఈ నిరసన ర్యాలీలు కేవలం పార్టీ రాజకీయ కార్యక్రమంలో ఒక భాగం గా మిగిలిపోవడం ఖాయం అంటున్నారు కూటమి మద్దతుదారులు.

సీజేపీ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని వైసీపీ మొదలుపెట్టిన మెగా డీఎస్సి నిరసన ర్యాలీలు సీజేపీ మాదిరి తమ లక్ష్యాన్ని చేరే వరకు కొనసాగించగలుగుతుందా.? లేదా చివరికి ఏ ఫలితం సాధించలేని ఓ రాజకీయ కార్యక్రమంగా ముగిస్తుందా.?

ADVERTISEMENT
Latest Stories