విమర్శలు వచ్చినా పక్క రాష్ట్రాల ఆసుపత్రులకు వైకాపా నాయకుల ఓటు

YSJagan - Andhra- Pradesh -Coronavirus- Covid-19
ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రతి రోజూ రికార్డ్ స్థాయిలో కోవిడ్ 19 కేసులు నమోదవుతున్నాయి. సామాన్యూలతో పాటు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. అయినా వారు అశ్రద్దగా ఉంటున్న సంఘటనలు తరచు చూస్తూనే ఉన్నాం.

తాజాగా వైసీపీకి చెందిన నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. గత వారం రోజులలో ఆయన నియోజకవర్గంలో విరివిగా పర్యటనలు చేస్తూ ప్రజలను కలుస్తున్నారు దాని పర్యవసానమే కరోనా అని అంటున్నారు.

ADVERTISEMENT

మరోవైపు…. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే కరోనా వస్తే పొరుగు రాష్ట్రాలకు పరిగెట్టడం విమర్శలకు తావిస్తుంది. సొంత రాష్ట్రం.. సొంత పాలన మీద నమ్మకం లేనట్టుగా పొరుగురాష్ట్రాలకు పరిగెట్టడం ఏంటి అని అంటున్నా వారి తీరు మారడం లేదు. కోటంరెడ్డి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు.

కొందరు ఎమ్మెల్యేలు సీఎంఓ నుండి సిఫార్సు లేఖలతో పొరుగు రాష్ట్రాల కార్పొరేట్ ఆసుపత్రులలో బెడ్లు సంపాదిస్తున్నారని ఇది సిగ్గుచేటని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే నిజమైతే ఆక్షేపణీయమే. మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలలో ఇద్దరు కరోనాకు పాజిటివ్ గా తేలారు.

ADVERTISEMENT
Latest Stories