వైకాపా మీడియా వర్గాల అర్ధం లేని ‘కధనాలు’

malladi vishnu fake liquor deathsకల్తీ మద్యం వలన విజయవాడలో అయిదుగురు దుర్మరణం పాలవ్వగా, మరికొంతమంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కృష్ణలంకలోని స్వర్ణ బార్ లో మద్యం సేవించడంతోనే ఇలా జరిగిందని తేలడంతో సదరు బార్ ను సీజ్ చేయడంతో పాటు, నగరంలోని అన్ని బార్లను మూసివేయాల్సిందిగా ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒక్క బార్ లో జరిగిన పనికి మిగతా వారందరూ సఫర్ అవుతున్నామని ఇతర బార్ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. అయితే సమస్య తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం సత్వర చర్యలు చేపడుతోంది. ఇంతకీ, సదరు ‘స్వర్ణ’ బార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లాది విష్ణు బంధువులుగా తేలడంతో, దీనికి రాజకీయ రంగు అంటుకుంది.

దీంతో రంగంలోకి దిగిన వైకాపా మీడియా అధికార ప్రభుత్వంపై ఉన్న తన అక్కసునంతా వెళ్లగక్కుతోంది. ప్రతిపక్షాల నాయకులను ఇరుకున పెట్టేందుకే మల్లాది విష్ణు పై కేసులు నమోదు చేస్తోందని, ఈ కేసులో ప్రభుత్వం అత్సుత్సహాం చూపుతోందని కధనాలను ప్రచురిస్తోంది. ‘మల్లాది విష్ణు దొరికాడు కాబట్టి, కేసులతో అధికార ప్రభుత్వం ఇరికించేయడానికి చూస్తోందని’ ఓ రేంజ్ లో రాతలు రాస్తోంది.

అంటే… రాష్ట్రంలో ఏం జరిగినా ప్రభుత్వం చూస్తూ ఉండాలన్న భావనను వైకాపా మీడియా వర్గాలు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చూసి చూడనట్లుగా వ్యవహరించిన విధానాన్నే చంద్రబాబు సర్కార్ కూడా అనుసరించాలని భావిస్తున్నారేమోనన్న భావన విశ్లేషకుల నుండి వస్తున్నాయి. అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలు చేయడం, రాతలు రాయడం జగన్ కు సపోర్ట్ చేసే “వెబ్ మీడియా”కు పరిపాటిగా మారిపోయిందని వీరి భావన.

ADVERTISEMENT
Latest Stories