నీట్ ఉద్యమం అటు కేంద్ర ప్రభుత్వం తో పాటుగా ఇటు ఇతర రాజకీయ పార్టీలకు కూడా అగ్నిపరీక్ష గా మారిందనే చెప్పాలి. సీజేపీ, కాంగ్రెస్ నిరసన లను ఎదుర్కొంటు తన ప్రభుత్వాన్ని నిర్దోషిగా చూపించుకోడం బీజేపీ ముందున్న అగ్నిపరీక్షా కాగా,
నీట్ విద్యార్థులకు భరోసాగా సాగుతున్న సీజేపీ ఉద్యమానికి తమ వంతు మద్దతు ప్రకటించి వారి డిమాండ్ల పట్ల బీజేపీ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేలా రాజకీయం చేయడం, విద్యార్థులకు, నిరసనకారులు మద్దతుగా తమ పార్టీ తరుపున గళం వినిపించడం ఇతర రాజకీయ పార్టీలకు అగ్నిపరీక్ష గా మారింది.
అయితే ఈ అగ్నిపరీక్షను ఇప్పటికే తెలంగాణలోని బిఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. నీట్ విద్యార్థులకు అండగా, నిరశనకారులకు మద్దతుగా, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిఆర్ఎస్ నుంచి ఒక్క ప్రకటన కూడా రావడం లేదు వై.? అంటూ సామాన్య ప్రజానీకం తో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కూడా బిఆర్ఎస్ కేంద్రంగా ప్రశ్నలు సంధించడంతో ఇక బిఆర్ఎస్ స్పందించక తప్పని పరిస్థితి.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నీట్ ప్రశ్న పత్రాల లీకేజ్ పై స్పందించారు. నీట్ ప్రశ్నా పత్రాల లీకేజ్ కారణంగా విద్యార్థులు, వారి తల్లితండ్రులు పడిన ఆందోళనకు కేసీఆర్ తల్లడిల్లిపోయారని, వారికీ అండగా ఉండేందుకు అవసరమైతే కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతారని,
నేటి జెన్ జీ లే రేపటి దేశ భవిష్యత్ అని, రాజకీయ నాయకుల కొడుకులు రేప్ లు చేస్తే వెంటనే బైళ్ళు వస్తున్నాయి కానీ పరీక్షా పాత్రల లీకేజ్ పై మాత్రం ప్రభుత్వాల వద్ద సమాధానం రావడం లేదంటూ తమ పై తమ పార్టీ పై పడిన నిందలను తుడిచిపెట్టేలా కేటీఆర్ నీట్ ఉద్యమం పై బీజేపీ కి వ్యతిరేకంగా ప్రకటనలు చేసి తన శీల పరీక్షను నిరూపించుకున్నారు.
మరి బిఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఆత్మబంధువైన వైసీపీ కూడా ఈ విషయంలో శీల పరీక్షకు సిద్ధం కాగలదా.? పార్టీ అధినేతగా వైఎస్ జగన్ నీట్ ఉద్యమానికి వైసీపీ తరుపున మద్దతు ప్రకటిస్తారా.? బీజేపీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డిమాండ్ కి పట్టుబట్టగలరా.?
బీజేపీ కి వ్యతిరేకంగా గళం విప్పగలరా.? తానూ బొద్దింకనే అంటూ ప్రకటించుకున్న జగన్ కాక్రోచ్ పార్టీ ఉద్యమానికి బలంగా నిలవగలరా.? కేటీఆర్ మాదిరి వైసీపీ కూడా మీడియా ముందుకొచ్చి నీట్ విద్యార్థులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురాగలదా.?






