వైసీపీ ఎన్నికల ప్రచార ఆర్భాటాలు, ప్రసంగాలు, ప్రతిపక్ష పార్టీల మీద చేసే విమర్శలు చూస్తుంటే ‘ప్రజలు వాస్తవాన్ని చూడలేకపోతున్నారా..? లేక ప్రజలకు ప్రతిపక్షాలు వాస్తవాలను చెప్పలేకపోతున్నాయా…?’ అనే అనుమానులు తలెత్తుతున్నాయి.
సిద్ధం అంటూ మైకు పట్టుకుంటున్న ముఖ్యమంత్రి మా ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను 99 % నెరవేర్చడం జరిగింది. మా ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మంచి జరిగితే మా పార్టీకి మరో అవకాశాన్ని ఇవ్వండి అంటూ ప్రజలను వేడుకుంటున్నారు. అయితే మానిఫెస్టోలో పెట్టిన హామీలలో 99 % నెరవేర్చాము అని నిసిగ్గుగా ప్రభుత్వ పెద్దలు ఉదరకొడుతుంటే….ప్రతిపక్షాలు వాస్తవాలను ప్రజలకు వివరించడంలో వెనుకపడ్డారనే వాదన ఎన్నికల తెర మీదకు వచ్చింది.
అసలు వైసీపీ హామీ ఇచ్చి నెరవేర్చని అంశాలు ఒక్కసారి పరిశీలిస్తే.., నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా కాబట్టి రాజధాని కూడా ఇక్కడే. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజధానిని మార్చేస్తాం అంటూ టీడీపీ చేస్తున్న ప్రచారం లో వాస్తవము లేదు. ఏపీకి అద్భుతమైన రాజధానిని మా ప్రభుత్వ హయాంలో పూర్తి చేస్తాం అంటూ అమరావతి రైతులకు జగన్ ఇచ్చిన భరోసా.., ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీ రెండు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏమయ్యాయో అందరికి విదితమే.
ఇప్పటికి ఏపీ ప్రజలతో రాజధాని దోబూచులాడుతూనే ఉంది. రాష్ట్ర పెద్ద అంటే ‘ముందు తానూ ఒక గూడు కట్టుకోవడం కాదు ప్రజలకు ఒక గూడు ఏర్పాటు చేయడమే’ అనేది ప్రజలు గ్రహించలేకపోవడమే వైసీపీ కి ఒక్క ఛాన్స్ అవకాశం కల్పించింది అనే వాదన లేకపోలేదు. అలాగే ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీ …సీపీఎస్ రద్దు. అధికారం వచ్చిన వారం రోజులలో సీపీఎస్ రద్దు చేసేస్తా అన్నా, ఆ విషయం నాకు వదిలేయండి అంటూ గత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లయినా సీపీఎస్ రద్దు కాలేదు.
అలాగే ఎన్నికల ముందు మెగా డిఎస్సి ప్రకటిస్తాం అంటూ ప్రచారం చేసుకుని నిరుద్యోగుల ఓట్లు దండుకున్న జగన్ ఎన్నికలకు రెండు నెలల ముందు దగా డిఎస్సి ఇచ్చి నిరుద్యోగులను నిట్ట నిలువునా మోసం చేసారు. జనవరి 1 ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం అన్నారు. క్యాలెండర్ లో సంవత్సరాలు మారాయి కానీ నిరుద్యోగుల తలరాత మాత్రం మారలేదు.
రాష్ట్రంలో పూర్తిగా మద్యం అనేది లేకుండా చేసి 2024 ఎన్నికలకు ఓట్లడుగుతాం అంటూ 2019 ఎన్నికలలో హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండే లిక్కర్ షాపుల వ్యాపారాన్ని ప్రభుత్వ గుప్తాదిపత్యంలోకి తీసుకున్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రభువత్వమే నాసి రకం మద్యం అమ్ముతూ….ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం.., ఎన్నడూ లేని విధంగా రాష్త్రం లో మద్యం మరణాల సంఖ్య పెరగడం ప్రజలు చూడలేకపోతున్నారా..?
2020 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేసేస్తాం… మీకెందుకు తొందరా…అంటూ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలను అవహేళన చేస్తూ అప్పటి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన ప్రసంగంతో ఆయన పదవి కాలం పూర్తియిందే కానీ ఇప్పటికి పోలవరం తన పొలిమేర దాటి బయటకు రాలేదు. ఇకముందు వస్తుందన్న నమ్మకము లేదు. 25 కి 25 ఎంపీ స్థానాలు వైసీపీ కి కట్టపెట్టండి కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తాం అంటూ గగ్గోలు పెట్టిన జగన్ అధికారంలోకి రాగానే ప్రజల నడ్డి విరిచారు.
రాని ప్రత్యేక హోదా మాట అటుంచితే వచ్చిన ప్రత్యేక ప్యాకేజీ సంగతి ఎటుపోయిందో కూడా ఎవరికీ తెలియని బ్రహ్మ పదార్థమే అయ్యింది. అలాగే గత ఎన్నికల ముందు విశాఖ ఎయిర్ పోర్టులో నా పై హత్య ప్రయత్నం జరిగింది…దీని పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అంటూ జగన్…తండ్రి లేని పిల్లాడి పై దాడి చేసి చంపేస్తారా..? అంటూ తల్లి విజయలక్ష్మి చేసిన హడావుడి ఇంతాఅంతా కాదు. జగన్ పై చిన్నపాటి విమర్శ చేసిన ప్రతిపక్ష పార్టీ నేతల పై కేసులు పెట్టి ఊచలు లెక్కపెట్టిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఏకంగా జగన్ పై దాడి చేసిన వ్యక్తి కేసును ఎందుకు ముందుకు తీసుకు వెళ్లలేకపోయింది..?
ఆ కేసు విచారణకు జగన్ ఎందుకు హాజరు కాలేకపోయారు..? దీని వెనుక దాగి ఉన్న మర్మం ఏమిటో ప్రజలకు అవగతం కాలేకపోతుందా..? అలాగే జగన్ ఇచ్చిన ట్విస్టులతో ఇది హైలైట్ అని చెప్పాలి. గుండె పోటుతో వివేకా మృతి చెందారు అంటూ జగన్ సొంత ఛానెల్ సాక్షిలో వార్తలు ప్రచారం చేసి, వైసీపీలో కీలక బాధ్యత వహించే విజయసాయి వివేకా గుండెపోటుతో మరణయించడం అత్యంత బాధకారం అంటూ చెప్పిన సానుభూతి మాటలు….ఒక్కసారిగా గొడ్డలిపోటుగా ఎలా మారిపోయిందో..?
నారసురా రక్త చరిత్రగా ఎలా తెరకేకిందో తెలుసుకునేలోపే వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. వివేకా దారుణ హత్య ఉదంతాన్ని వివరించిన జగన్ మాటలలో అసలు అంతరార్థం అర్ధం చేసుకోవడానికి సొంత చెల్లిలికే ఏడాది సమయం పట్టింది. అసలు తన తండ్రి హత్య వెనుక ఉన్న సూత్రధారులను పాత్ర దారులను న్యాయస్థానం ముందు ఉంచాలని చూస్తున్న వివేకా కుమార్తె సునీతా కు అవరోధాలు సృష్టిస్తుంది ఎవరు..? కేసు విచారణకు హాజరు కాకుండా సాకులు చెప్పి తప్పించుకుంటున్న అవినాష్ రెడ్డి ని కాపాడుకుంటుంది ఎవరు..?
తన తండ్రి హత్యకు న్యాయం కావాలి అంటూ పోరాడుతున్న సునీతా పై ఆరోపణలు చేస్తుంది ఎవరు.? తనకు రాజకీయంగా ఎదురొస్తున్న సొంత చెల్లి పై వ్యక్తిగత దూషణలు చేయిస్తున్న పెద్ద మనుషులు ఎవరు..? ఇవన్నీ కూడా ప్రజలు చూడలేకపోతున్నారా..? ప్రతిపక్షాలు చేపలేకపోతున్నాయా..? అనే సందేహం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్నగానే మిగిలిపోతుంది. రాష్ట్రంలో జరుగుతున్నా ఈ దారుణాలన్నిటి వేళ్ళు అధికార పార్టీ వైపు చూపిస్తుంటే అధికార పార్టీ నేతలు మాత్రం వాటిని కూడా ప్రతిపక్షాలు పై రుద్దడానికి ప్రయతింస్తుండం చూస్తుంటే ఈసారి కూడా గతం మాదిరే ప్రజలను మభ్యపెట్టవచ్చు అని వైసీపీ నేతలు భావిస్తున్నారు అనుకోవచ్చు.




