
ప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకాశం జిల్లా పొదిలి పర్యటన సాగింది.
ఇప్పటి వరకు జగన్ శవ రాజకీయాలు చేసేందుకు వచ్చినప్పుడు దారిపొడవునా వైసీపీ శ్రేణుల చేత జేజేలు పలికించుకుంటూ ముందుకు సాగిపోయేవారు. దాని వలన స్థానిక ప్రజలకు కాసేపు ఇబ్బంది పడినా, కూటమి ప్రభుత్వం కూడా ఎన్నడూ ఆ ఊరేగింపులను అడ్డుకోలేదు. తప్పు పట్టలేదు.
Also Read – చంద్రబాబు-రేవంత్ సమావేశం వైసీపీ, బీఆర్ఎస్ జీర్ణించుకోగలవా?
కానీ పొదిలిలో వైసీపీ శ్రేణులు జగన్ మీసం మెలేస్తున్న ఫోటోతో “ఎవడైనా రానీ.. తొక్కి పడేస్తాం” అని వ్రాసున్న ఫ్లెక్సీ బ్యానర్స్ ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు. వారిలో కొందరు పక్కనే ఉన్న పోలీసులు, మహిళా రైతులపైకి రాళ్ళు విసిరారు. ఇవన్నీ మీడియా వీడియోలలో రికార్డు అయ్యాయి.
మంత్రి కొలుసు పార్ధ సారధి ఈరోజు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి, ఆ వీడియోలు చూపించి, వైసీపీ ఏవిదంగా దాడులు చేస్తోందో వివరించారు.
Also Read – కమల్ హాసన్‌కి మాత్రమే న్యాయం…. చాలుగా!
వైసీపీ ఓ పధకం ప్రకారమే ఈవిదంగా చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయంటూ ఆరోపణలు చేస్తోందన్నారు.
ఒకవేళ జగన్‌కు నిజంగానే ప్రజా సమస్యలు లేదా పొగాకు రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటే శాసనసభ సమావేశాలకు వచ్చి నిలదీయవచ్చు కదా?కానీ ఈవిదంగా ‘ఆర్గనైజ్డ్ క్రైమ్’ ఎందుకు చేయిస్తున్నారని మంత్రి కొలుసు పార్ధ సారధి ప్రశ్నించారు.
Also Read – బీజేపీ వాదానికి మూడు పార్టీల మద్దతు…
జగన్ హయంలో దెబ్బ తిన్న ఆంధ్రప్రదేశ్, అమరావతి బ్రాండ్ ఇమేజ్ సిఎం చంద్రబాబు నాయుడు వచ్చాక మెరుగు పడుతుండటంతో చూసి ఓర్వలేకనే జగన్ ఇటువంటి నీచమైన కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
కానీ వైసీపీ నేరగాళ్ళని పోగేసుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని, తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్ధ సారధి స్పష్టం చేశారు.
మంత్రి కొలుసు పార్ధ సారధి ఈవిదంగా వైసీపీ అల్లర్లని వీడియో ప్రజంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం చాలా మంచి ఆలోచనే.
అయితే ఇకపై వైసీపీ ఇదే పద్దతిలో రాజకీయాలు చేయబోతోందని స్పష్టమైనప్పుడు, కూటమి ప్రభుత్వం కూడా హితోక్తులతో కాలక్షేపం చేయకుండా, రోడ్లపైకి వచ్చి రెచ్చిపోయే ఇలాంటి ప్రతీ రౌడీకి భయం పరిచయం చేయడం చాలా అవసరం.