వైసీపీ ‘వై నాట్ మంగళగిరి’ అనగలదా?

YSR Congress Leaders Worst Comments on Amaravati Women

గత సార్వత్రిక ఎన్నికల ముందు ‘వై నాట్ 175’, ‘వై నాట్ కుప్పం’, ‘వై నాట్ పిఠాపురం’ అంటూ రాజకీయ నినాదాలు చేసిన వైసీపీ ఇప్పుడు కూటమి నుంచి ‘వై నాట్ పులివెందుల’ అనే ఊహించని రిటర్న్ గిఫ్ట్ పొందిన తరుణంలో వైసీపీ కూడా కూటమికి రిటర్న్ గిఫ్ట్ గా ‘వై నాట్ మంగళగిరి’ అంటూ నారా లోకేష్ కి సవాల్ విసరగలదా?

డీఎస్సీ లో అక్రమాలు అంటూ నాడు నిరసన దీక్షలు, ర్యాలీలు నిర్వహించిన వైసీపీ, అందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చెయ్యాలని తీవ్రస్థాయిలో డిమాండ్ చేసింది. ప్రజలు తమ వైపే ఉన్నారని, డీఎస్సీ నియామకాల విషయంలో మంత్రిగా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారని ప్రజలు విశ్వసిస్తున్నారని సాక్షి నుంచి వైసీపీ సోషల్ మీడియా వరకు ఉదృతంగా ప్రచారం చేసింది.

ADVERTISEMENT

అలాగే వైసీపీ అధినేతగా వైఎస్ జగన్ నుంచి ఆ పార్టీ నేతల వరకు అందరూ ముక్తకంఠంతో లోకేష్ రాజీనామా కోసం పట్టుబట్టారు. అయితే వైసీపీ ప్రచారాలు నిజమైతే, క్షేత్ర స్థాయిలో లోకేష్ పై ప్రజావ్యతిరేకత అంతలా కనిపిస్తుంటే స్వయానా లోకేష్ సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభంజనాన్ని అడ్డుకోగలదా.?

ప్రజల్లో తమ వాదనకు నిజమైన మద్దతు ఉందని నిరూపించుకోవడానికి వైసీపీకి స్థానిక ఎన్నికల రూపంలో ఇదొక సువర్ణావకాశమనే భావించాలి. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, మంగళగిరి గడ్డపై కూటమిని ఎదుర్కొని విజయం సాధించి చూపగలరా? గతంలో ప్రత్యర్థులకు ‘వై నాట్’ సవాల్ విసిరిన ఆ పార్టీ, ఇప్పుడు అదే వ్యూహంతో ‘వై నాట్ మంగళగిరి’ అంటూ ముందుకు వచ్చే రాజకీయ సాహసం చేస్తుందా?

ADVERTISEMENT
Latest Stories