ఎంట్రీలోనే ‘కింగ్ ఖాన్’ షారుక్ ఖాన్ తో నటించిన బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రస్తుతం ఆకాశంలో ఎగురుతోంది. ‘సూపర్ స్టార్’ సల్మాన్ ఖాన్ తో నటించాలనే ఆకాంక్ష నెరవేరినందుకు ఈ ముద్దుగుమ్మ చాలా సంతోషంగా ఉంది. బాలీవుడ్ హాట్ బ్యూటీస్ అయిన దీపికాపదుకొనే, కత్రినా, పరిణితీ చోప్రా, కంగనా రనౌత్, కృతిసనన్ వంటి వారితో పోటీపడి మరీ అనుష్కశర్మ ‘సుల్తాన్’ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.
బాలీవుడ్ వర్గాల్లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ గా భావిస్తోన్న ‘సుల్తాన్’ షూటింగ్ లో అడుగు పెట్టగానే తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. అమీర్, షారూక్ లాంటి బాలీవుడ్ సూపర్ స్టార్లతో నటించిన అనుష్క మొదటిసారిగా సల్మాన్ కు జోడీగా కట్టడంతో ఖాన్ త్రయంతో నటించిన హీరోయిన్ల జాబితాలో అనుష్క కూడా చేరిపోయినట్లయ్యింది. హర్యానాకు చెందిన 40 ఏళ్ల రెజ్లర్ సుల్తాన్ అలీ ఖాన్ జీవిత కథ ఆధారంగా “సుల్తాన్” సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా, అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వం వహిస్తున్నారు.





