1000 రూపాయలు అవుట్… 1 రూపాయి ఇన్..!

1 Rupee Note - RBI Press500, 1000 రూపాయల నోట్ల రద్దు అనంతరం, 2000 రూపాయల నోటు ప్రవేశపెట్టగా, దీనికి చిల్లర దొరకక ఇబ్బందులు తలెత్తిన వైనం తెలిసిందే. ఇందుకు పరిష్కారార్ధం, వెయ్యి రూపాయల నోటును మరింత సెక్యూరిటీతో ప్రవేశపెట్టబోతున్నారని ఇటీవల వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయన్న ఉద్దేశంతో ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ స్పష్టత ఇచ్చారు.

1000 రూపాయల నోటును మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టే యోచన లేదని, అలాంటి వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని తేల్చిచెప్పారు. తాజాగా సేవింగ్స్ అకౌంట్స్ పై నిబంధనలు సడలిన నేపధ్యంలో కరెన్సీ అందరికీ అందుబాటులోకి వచ్చిందని, అయితే అవసరం మేరకే ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. వెయ్యి రూపాయల నోటు గురించి విషయం ఇలా ఉంటే, ప్రజలకు ప్రీతిపాత్రమైన మరో నోటును ఆర్బీఐ విడుదల చేసింది.

ADVERTISEMENT

ఇండియన్ కరెన్సీకి కొలమానమైన ఒక రూపాయి నోటు కొన్ని సంవత్సరాలుగా ప్రజలను పలకరించడం లేదు. నోట స్థానంలో కాయిన్స్ వచ్చాయి గానీ, ఒక రూపాయి నోటు లుక్కే వేరన్న విషయం పాత తరానికి తెలిసిందే. అయితే అంతటి ప్రాధాన్యత గల ఒక రూపాయి నోటును తాజాగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా విడుదల చేసింది. దీంతో పెద్దోళ్ళ కోసం 2 వేలు, పేదోళ్ళ కోసం 1 రూపాయి నోటు వచ్చిందంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న టాక్.

ADVERTISEMENT
Latest Stories