మేం ముగ్గురు స్టోరీ వింటే హిట్టే!

14-Reels-Entertainment-anil -sunkaraప్రిన్స్ మహేష్ బాబుతో వరుసగా సినిమాలు నిర్మించి టాలీవుడ్ లో ఒక సంచలన బ్యానర్ గా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిలిచింది. ఒక్క ట్రేడ్ వర్గీయుల్లోనే కాదు, సినీ అభిమానుల్లోనూ 14 రీల్స్ కు ఒక గుర్తింపు వచ్చింది. ఈ సంస్థ నిర్మించిన తాజా చిత్రం “కృష్ణగాడి వీరప్రేమగాధ.” నాని హీరోగా రూపొందిన ఈ సినిమా ఆడియో ప్రిన్స్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైంది.

ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర అభిమానులను ఆకట్టుకునే ప్రసంగం చేసారు. మేం ముగ్గురు నిర్మాతలము కలిసి విని, సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసిన స్టోరీలన్నీ హిట్టయ్యాయని, సెంటిమెంట్ రీత్యా “కృష్ణగాడి వీరప్రేమగాధ” సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అనిల్ అన్నారు. అయితే ఒక సంవత్సరం క్రితం తెలిసో, తెలియకో (ఆగడు సినిమా రూపంలో) ఒక తప్పు చేసామని, ఆ సమయంలో మా సంస్థతో అనుబంధం ఉన్న వారు అందించిన సహకారం మరువలేనిదని అనిల్ చెప్పుకొచ్చారు.

అయితే మళ్ళీ గర్వంగా నిలిచేలా “కృష్ణగాడి వీరప్రేమగాధ” సినిమాను నిర్మించామని, కష్టకాలంలో ఉన్న మాకు నాని అందించిన సహకారం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటామని, చెప్పగానే మరో క్షణం ఆలోచించకుండా ఈ ఆడియో ఆవిష్కరణకు వచ్చిన మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని సుంకర చేసిన చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి.

ADVERTISEMENT
Latest Stories