ఒక్క ఏపీ వ్యక్తికి కరోనా సోకడంతో 14 గ్రామాలు మూసివేత

Coronavirusఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి వల్ల ఉత్తర్ ప్రదేశ్ లో 14 గ్రామాలను నిర్బంధంలో ఉంచారు. వివరాల్లోకి వెళ్తే…. యూపీ‌లోని బడౌన్‌ జిల్లాలో భవానీపూర్‌ కాలీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి నివసిస్తున్నాడని, అతడు గత నెలలో దిల్లీలో జరిగిన జమాత్ కార్యక్రమంలో పాల్గొనడంతో అతనికి వైరస్ సోకి ఉండవచ్చని అంటున్నారు. .

ADVERTISEMENT

శనివారం అతడికి కరోనా పాజిటివ్ గా తేలడంతో 3 కి.మీ వ్యాసార్థంలో ఉన్న గ్రామాలను మూసివేస్తున్నట్లు బడాన్‌ జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా కేసులు 500కు చేరువలో ఉన్నాయి. ఒక్క బడౌన్‌ జిల్లాలోనే కరోనా బాధితుల సంఖ్య 134కు చేరింది. దీనితో జిల్లా యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంది.

ఇది ఇలా ఉండగా…. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం దేశవ్యాప్తంగా 9,152 కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రేపటితో మూడు వారాల పాటు విధించిన లాక్ డౌన్ పూర్తి కానుండడంతో మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

తదుపరి దశలో రెడ్, ఆరంజ్ మరియు గ్రీన్ యొక్క జోనల్ వ్యవస్థ అమలు చేయబడుతుందని వార్తలు వస్తున్నాయి. రెడ్, ఆరంజ్ మరియు గ్రీన్ జోన్లను వ్యాప్తి యొక్క తీవ్రతను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ప్రాంతాలను వర్గీకరిస్తాయి. 15 కంటే ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతాలను రెడ్, 15 కంటే తక్కువ ఉంటే ఆరంజ్, మరియు కేసులు లేని చోట్ల గ్రీన్ గా వర్గీకరించవచ్చని అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories