సాయిరెడ్డి మూలాలు మరువలేదా.?

Why Vijayasai Reddy's Amaravati Remarks Stirred Fresh Row

వైసీపీ పార్టీలో నెంబర్ – 2 గా జగన్ అక్రమాస్తుల కేసులో A – 2 గా ఉన్న విజయసాయి రెడ్డి 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర ఓటమి తరువాత వైసీపీ పార్టీకి, ఆ పార్టీ రాజ్యసభ సీటుకు కూడా రాజీనామా చేసి రాజకీయాల నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నా అంటూ ప్రకటించి వైసీపీ మద్దతుదారులకు కూడా ఊహించని షాక్ ఇచ్చారు.

అయితే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి, వైసీపీ కి రాజీనామా చెయ్యడానికి కూడా జగన్ చుట్టూ ఉన్న కోటరీ నే కారణమంటూ ప్రకటించిన సాయి రెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ మీద భిన్న ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. సాయి రెడ్డి బీజేపీ లో చేరుతారని, తద్వారా తిరిగి వైసీపీ ని బీజేపీ కి దగ్గరచేస్తారంటూ సోషల్ మీడియాలో గట్టి ప్రచారమే నడిచింది.

ADVERTISEMENT

అయితే తన పొలిటికల్ రీ ఎంట్రీ మీద నడుస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ తానూ ప్రస్తుతానికి ఏ పొలిటికల్ పార్టీలో చేరడడం లేదని, మీడియా రంగంలోకి అడుగుపెడుతున్నానని, నిష్పాక్షికంగా ప్రజల తరుపున వార్తలు వినిపించే విధంగా ముందు సోషల్ మీడియా లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి అడుగుపెడతానన్నారు.

అలాగే అవసరమైనప్పుడు పొలిటికల్ రీ ఎంట్రీ కూడా ఇస్తానని తన రీ ఎంట్రీ ఉహాగణాలను అలానే వదిలిపెట్టారు. అయితే తాజాగా 2029 ఎన్నికలు వైసీపీ మావిగన్ vs కూటమి అమరావతి అంటూ జగన్ చేసిన ప్రకటన పై స్పందించారు రెడ్డి గారు.

రెడ్డి గారు వైసీపీ పార్టీ వీడినప్పటి దాని మూలలను విడిచిపెట్టలేదు అనేలా అమరావతి పై జగన్ చేస్తున్న విష ప్రచారాలకు తనవంతు మద్దతుగా సాయిరెడ్డి ప్రకటనలు చేసారు. అమరావతి పేరు మీద టీడీపీ వేలకోట్ల అవినీతికి పాల్పడుతుందని. ఆ అవినీతికి వ్యతిరేకంగా తానూ కోర్టుకెళ్తానని, అమరావతి నిర్మాణాలను ఒక భారీ అవినీతి యజ్ఞమంటూ అభివర్ణించారు.

వైసీపీ నుంచి ఆ పార్టీ మద్దతుదారుల వరకు చివరికి ఆ పార్టీ మాజీ నేతలతో సహా మూకుమ్మడిగా రాష్ట్ర రాజధాని అమరావతి మీద ఎందుకింత విషం చిమ్ముతున్నారు. అవినీతి పేరు చెప్పుకుంటూ నిర్మాణాల ఆపివేతకు ఎందుకు తహతహలాడుతున్నారు.

రాజధానిని అడ్డుకునేందుకు న్యాయస్థానాలను సైతం ఎందుకు ఆశ్రయిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు అమరావతి నిర్మాణాలలో టీడీపీ భారీ అవినీతికి పాల్పడిందంటరు ఆరోపించిన వైసీపీ 2019 అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల తమ హయాంలో ఆ ఆరోపణలకు తగ్గ ఒక్క ఆధారాన్ని కూడా ప్రజల ముందు ఉంచలేకపోయింది.

ఇక ఇప్పుడు మరోసారి అమరావతి నిర్మాణాలను అడ్డుకునేందుకు మళ్ళీ పాత ఆరోపణలకే కొత్త రూపాన్ని ఇస్తూ సాక్షి నుంచి వైసీపీ శ్రేణుల వరకు, జగన్ మద్దతుదారుల నుంచి జగన్ మాజీ శ్రేయోభిలాషుల వరకు అందరు అదే రాగం అందుకుంటున్నారు. ఇందులో సాయిరెడ్డి కూడా ఒక భాగం కావడం కొసమెరుపు.

ADVERTISEMENT
Latest Stories