నాటి మహాభారత కురుక్షేత్రానికి నాంది వేసిన ద్రౌపతి వస్త్రాపహరణం వందమంది తో దృఢంగా ఉన్న కౌరవసేనను అంతమొందించింది. అయితే దుర్యోధనుడి ఆదేశాలను శిరసావహించి ద్రౌపతి శిరోజాలను పట్టి ఈడ్చిన దుశ్యాసనుడి సాహసానికి మొత్తం కౌరవ సామ్రాజ్యం, వారికి మద్దతుపలికిన రాజ్యాలు అన్ని కూడా పాంచాలి అవమాన భారం ముందు కొట్టుకుపోయాయి.
తమ రాజు ఆజ్ఞాపించాడు కదా అని విచక్షణ మరిచి, మంచి చెడులను పక్కన పెట్టి, విలువలకు తిరోధకాలు ఇచ్చినందుకు గాను దుశ్యాసనుడు సొంత సోదరుడి చేతిలోనే అత్యంత దారుణంగా చంపబడ్డాడు. అలాగే తన ఆదేశాలను పాటించే వారు ఉన్నారు కదా అని కనీసం పాపభీతి కూడా లేకుండా ఆజ్ఞలు జారీచేసిన దుర్యోధనుడు చివరికి తన చావు కోసం ప్రార్ధనలు చేసే స్థాయికి దిగజారుడు.
అయితే ఈ మహాభారతంలో అందరు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఆదేశాలు ఇచ్చేవాడు మనవాడైనా అది ధర్మబద్ధమా.? న్యాయసమ్మతా.? అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని ముందుకెళ్లాలి లేకుంటే నాటి దుశ్యాసనుడు, దుర్యోధనుడు మాదిరే నేడు సోషల్ మీడియాలో కులం కార్డు అడ్డుపెట్టుకుని, మతం రంగు పులుముకుని హద్దులు దాటి ప్రవర్తిస్తున్న కొంతమంది కలియుగ కౌరవసేన కూడా అంతమొందక తప్పదు.
అందుకు 2019 – 2024 ఎన్నికల ముందు వరకు వైసీపీ పార్టీ కోసం, జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం ఆ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియా చాటున చేసిన దారుణాలు, భావప్రకటన స్వేచ్ఛ పేరుతో దాటిన హద్దులు సమాజం కూడా సిగ్గుతో తలవంచుకునేలా చేసింది. చివరికి 2024 వైసీపీ ఓటమితో ఆ సోకాల్డ్ దుశ్యాసనులు కనుమరుగయ్యారు.
అందులో కత్తిమహేష్ మొదలుకుని శ్రీరెడ్డి, బోరుగడ్డ, వర్రా రవీంద్రా రెడ్డి ఇలా ఎందరో వైసీపీ రాజకీయానికి బలైయ్యారు, అలాగే ఆ పార్టీ అధినేతల ఆదేశాల అమలుకు మూల్యం చెల్లించారు. ఇక ఇప్పుడు వారి స్థానాలను భర్తీ చేసేందుకు ఉవ్విలాడుతున్న వారి సంఖ్య కూడా పెద్దగానే కనిపిస్తుంది. అందుకోసం వారు ఈ సారి కులం, మతం తో పాటుగా ప్రాంతాన్ని కూడా జోడించారు.
అందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసం తెలంగాణ జర్నలిస్టులు అంటూ సోషల్ మీడియాలో వైసీపీ కోసం డ్యూటీ చేస్తున్నారు కొంతమంది తెలంగాణ వాదులు. వీరంతా ఏపీ రాజకీయాల మీద విశ్లేషణలు చేసే హక్కు, ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు చేసే అధికారం, ప్రభుత్వ పెద్దల మీద బూతులతో విరుచుకుపడే స్వతంత్రం పొందిన దుశ్యాసనులు.
అయితే విలువలు గాలికొదిలేసి, ఎవరి కళ్ళల్లోనో ఆనంద, చూడడానికి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి, కులాల మధ్య అడ్డుగోడలు సృష్టించడానికి, మతాల ముసుగులో ముప్పేట దాడి చేయడానికి వెనుకాడడం లేదు ఈ కలియుగ దుశ్యాసనులు.
అయితే నాటి కౌరవ సేన పాపపలకు చితి పేర్చిన భీముని మాదిరి, వారి సైన్యాన్ని అంతమొందిన అర్జునిడి లెక్క, గీతోపదేశం చేసిన శ్రీ కృష్ణుడి తరహాలో ఈ సోషల్ మీడియా దుశ్యాసనుల అంతం కోసం కూడా భీముని మాదిరి బలమైన చట్టాలు, అర్జునిడి లెక్క పదునైన కేసులు, కృష్ణుడి గీతోపదేశం తరహా శిక్షలు అమలు చెయ్యాలి.
నాటి దుశ్యాసనుడు నిండు సభలో ద్రౌపతి ని అగౌరవపరిస్తే నేటి ఈ సోషల్ మీడియా దుశ్యాసనులు మొత్తం సమాజం ముందు రాజకీయాన్ని కించపరుస్తున్నారు, జర్నలిజాన్ని అవమానిస్తున్నారు. నోటికి వచ్చిందల్లా మాట్లాడడం చివరికి చర్యలు తీసుకుంటే తెలంగాణ వారి మీద ఆంధ్రా పెత్తనం అనడం,
కేసులు పెడితే కులం కార్డు బయటకు తీసి పలానా కులం వ్యక్తి మీద దాడి అంటూ రెచ్చిపోవడం, కులాన్ని రెచ్చకొట్టడం, ఇక అరెస్టులు చేస్తే మా మతం వారికి సంకెళ్లా అంటూ గగ్గోలు పెట్టడం ఒక అలవాటుగా మారిపోయింది. మరి సోషల్ మీడియా వేదికగా రాజకీయానికి జరుగుతున్న ఈ వస్త్రాపహరణానికి మూల్యం వెనకుండి ఆదేశాలిచ్చే దుర్యోధనుడు తీసుకుంటాడా.? లేదా తెరమీద కనిపించే దుశ్యాసనుడు తీసుకుంటాడా.?






