145 కోట్ల హిట్స్ దాటిన ‘యూ ట్యూబ్’ వీడియో!

145 crore hits for adele hello video songప్రపంచంలోని అన్ని రకాల వీడియోలకు కేరాఫ్ అడ్రస్ ‘యూ ట్యూబ్.’ అంతటి ప్రాధాన్యమున్న యూ ట్యూబ్ లో ఓ వీడియో వంద కోట్ల మేర హిట్స్ సాధించడమంటే సాధారణ విషయం కాదు. గంగమ్ వంటి అరుదైన పాటలకు మాత్రమే ఈ రికార్డు వశమైంది. అయితే గతేడాది అక్టోబర్ 22న యూ ట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఓ వీడియోను మరో సంచలనాత్మకమైన విజయాన్ని అందుకుంది.

అప్పటినుండి ఇప్పటివరకు ఏకంగా 145 కోట్ల 57 లక్షలకు పైగా హిట్స్ సాధించడం రికార్డుగా నిలిచింది. ‘అడెలె-హెలో’ పేరిట యూ ట్యూబ్ లోకి వచ్చిన ఈ వీడియో నిజంగా రారాజే. 7 లక్షల మందికిపైగా జనాలు ఈ వీడియో పట్ల తమ స్పందనను కూడా కామెంట్ల రూపంలో తెలియజేసారు. ఆరు నిముషాల ఆరు సెకన్ల పాటు సాగే ఈ పాటపై మీరూ ఓ లుక్కేయండి..!

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories