2000 రూపాయల నోట్ల రద్దుపై తాజా ప్రకటన!

2000 Rupees Note Ban Latest Newsఎప్పుడైతే ఒక్కసారిగా పెద్ద నోట్ల రద్దు చేసి, 2000 రూపాయల నోటు ప్రవేశపెట్టారో ఆనాటి నుండి కూడా ఈ నోటును కూడా ప్రభుత్వం త్వరలో రద్దు చేస్తుందని, ఇప్పుడు కాకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు ఏదొక సమయంలో ఖచ్చితంగా ప్రకటన వెలువడుతుందని జరిగిన ప్రచారం గురించి చెప్పనవసరం లేదేమో! ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు లాంటి వారయితే, అసలు ఈ నోటును ఎందుకు ప్రవేశపెట్టారు? దీనిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేసారు. దీంతో 2000 వేల రూపాయల నోటు రద్దు అంశం మరింత బలపడింది.

అయితే ఈ పుకార్లను నమ్మవద్దంటూ ఎప్పటికప్పుడు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు మరియు కేంద్ర మంత్రులు ప్రకటనలు ఇస్తున్నప్పటికీ, వాటిని విశ్వసించే పరిస్థితులు లేకపోవడంతో, పదే పదే సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఓ పక్కన కరెన్సీపై ఆంక్షలు విధిస్తూ వస్తోన్న కేంద్రం మాటలకు, చేపడుతున్న కార్యక్రమాలకు పొంతన లేకపోవడంతో ఏ క్షణంలోనైనా ఈ పెద్ద నోటు మార్కెట్ నుండి వెళ్ళిపోతుందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తాజాగా 200 రూపాయల నోటు వస్తుందన్న ప్రచారంతో మరింత బలం చేకూరినట్లయ్యింది.

ADVERTISEMENT

అయితే వీటిని నమ్మవద్దని, రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేస్తారంటూ వస్తున్న వదంతులను ఖండించారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజ్. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మధుసూదన్ మిస్త్రీ అడిగిన ప్రశ్నకు కిరణ్ రిజిజు జవాబిచ్చారు. గుజరాత్, పశ్చిమ బెంగాల్ లో నకిలీ కరెన్సీని ఎక్కువగా పట్టుకున్నామని, నకిలీ కరెన్సీని గుర్తించలేకపోతున్నారనే వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. కొత్త నోట్లకు నకిలీ కరెన్సీ తయారు చేయడం సాధ్యం కాదని, చాలా సెక్యూరిటీ ఫీచర్లతో కొత్త నోట్లను విడుదల చేశామని, నకిలీ కరెన్సీని నిర్మూలించడానికి ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories