2016 సంక్రాంతి ‘సంథింగ్ స్పెషల్’గా మారింది!

Music director Devi Sri Prasad Anup rubensప్రతి ఏడాది సంక్రాంతి పండుగ రావడం, దానితో పాటు తెలుగు సినిమాలు కలెక్షన్ల పండగ చేసుకోవడం షరామామూలే! అయితే రానున్న 2016 సంక్రాంతి మాత్రం “సంథింగ్ స్పెషల్”గా మారనుంది. రాబోతున్న సంక్రాంతి పండుగకు మూడు పెద్ద సినిమాలు ‘కర్చీఫ్’ వేసుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో,” బాలకృష్ణ “డిక్టేటర్,” నాగార్జున “సోగ్గాడే చిన్నినాయనా” చిత్రాలు విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఉన్నట్లుండి రెండు చిత్రాలకు అనుకోని ‘విషాదం’ ఎదురయ్యింది.

బాలకృష్ణ ‘డిక్టేటర్’ను మినహాయిస్తే, ‘నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రాల సంగీత దర్శకులైన దేవిశ్రీప్రసాద్, అనూప్ రూబెన్స్ లకు తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. దేవి తండ్రిని కోల్పోగా, అనూప్ తల్లికి దూరమయ్యాడు. అయితే ఇంత విషాదకర పరిస్థితుల్లోనూ ఆ ఇద్దరూ తమ తమ విధులను నిర్వర్తించి, చిత్రాలను ప్రకటించిన సమయానికే విడుదల చేయాల్సిన బాధ్యత నెలకొంది. నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో దర్శక నిర్మాతలు గానీ, హీరోలు గానీ ఎలాంటి ఒత్తిడి తీసుకురారు. దేవి, అనూప్ విషయంలోనూ జరిగింది అదే!

కానీ, బాధను దిగమింగుతూ దేవి రీ రికార్డింగ్ కు రెడీ అయిపోగా, దాదాపుగా అనూప్ కూడా అదే బాటను అనుసరించవచ్చు. ఇలా ఈ రెండు సినిమాలు సంగీత దర్శకుడి పరంగా సినీ అభిమానుల్లో ‘సింపతీ’తో విడుదల కానున్నాయి. సాధారణంగా ‘సెంటిమెంట్’కు పడిపోయే తెలుగు ప్రేక్షకులు ఈ రెండు సినిమాలను ప్రత్యేక దృష్టితో చూస్తారని చెప్పక తప్పాదు. గతంలో ‘మనం’ సినిమా సందర్భంలో ఏఎన్నార్ ‘కాలం’ చేసిన ‘సెంటిమెంట్’ ఆ సినిమాను ప్రేక్షకుల దృష్టిలో ఎక్కడో నిలబెట్టిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories