‘తమిళ’ రాజకీయాల్లో ‘తెలుగు’ వారి హవా!

DMK M Subramanianఇటీవల వచ్చిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో మొత్తం 22 మంది తెలుగు వారు విజయం సాధించారు. అయితే, తమిళనాట ఉన్న భాష ప్రభావం రీత్యా… తాము తెలుగు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లమని చెప్పుకునేందుకు వీరిలో అత్యధికులు సిద్ధంగా లేకపోవడం గమనార్హం.

తాజా ఎన్నికల్లో డీఎంకే 20 మంది తెలుగు వారికి, అన్నాడీఎంకే 13 మందికి, కాంగ్రెస్ ఇద్దరికి, బీజేపీ ఐదుగురు… మొత్తం 40 మంది తెలుగు వాళ్లకు టికెట్లు ఇవ్వగా, వారిలో 22 మంది గెలిచారు. అయితే తాము తెలుగు వాళ్లమని చెప్పేవారు పట్టుమని పది మంది కూడా లేకపోవడం విశేషం.

ADVERTISEMENT

చెన్నై నగర మాజీ మేయర్, చిత్తూరు జిల్లా కుటుంబానికి చెందిన వ్యక్తి సుబ్రహ్మణియన్ చెన్నై పరిధిలోని సైదాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీఎంకే తరఫున పోటీపడి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కూడా తెలుగు కుటుంబానికి చెందిన వారేనన్న సంగతి అందరికీ తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories