‘అ…ఆ…’ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్!

a aa movie firstday collections‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా తర్వాత పెద్దగా విరామం తీసుకోకుండా ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ పట్టాలెక్కించిన సినిమా ‘అ… ఆ…’ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు పెద్ద సినిమాలు బ్లాస్ట్ కావడంతో, త్రివిక్రమ్ సినిమా అయినా ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచుతుందో లేదోనన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటిని పటాపంచలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అ… ఆ…’ సినిమాకు మొదటి రోజు అపూర్వమైన కలెక్షన్స్ స్వాగతం పలికారు.

ఏపీ, తెలంగాణా, ఓవర్సీస్ అన్న తారతమ్యం లేకుండా అన్నీ ఏరియాల నుండి ‘పాజిటివ్’ టాక్ సంపాదించుకున్న ‘అ… ఆ…’ సినిమా తొలిరోజు దాదాపు 8 కోట్ల వరకు రాబట్టిందని టాక్. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 5 కోట్లు పైన వసూలు చేయగా, ఓవర్సీస్ ఒక్క ప్రీమియర్స్ కే 1.69 కోట్లు రావడంతో, తొలిరోజు వసూళ్ళపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అలాగే కర్ణాటక వంటి తెలుగు ప్రాబల్యం గల ఇతర రాష్ట్రాలలో కూడా ‘అ… ఆ…’ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడంతో, ఈ వీకెండ్ ముగిస్తే… సినిమా ఖర్చు వచ్చేస్తుందని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు.

ADVERTISEMENT

భారీ సినిమాలు వరుసగా పతనమవుతున్న నేపధ్యంలో ‘మిడిల్ క్లాస్’ బడ్జెట్ తో విడుదలైన ‘అ… ఆ…’ సక్సెస్ సినీ ఇండస్ట్రీకి మంచి పరిణామం. ఇదే రేంజ్ కొనసాగితే నితిన్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా కూడా ‘అ… ఆ…’ నిలుస్తుందని ట్రేడ్ వర్గీయులు భావిస్తున్నారు. కధగా చెప్పుకోవడానికి ఏమీ లేనప్పటికీ, త్రివిక్రమ్ డైలాగులకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా త్రివిక్రమ్ డైలాగ్స్ ను క్యాచ్ చేయగలిగిన వారు మాత్రం… మాటల మాంత్రికుడి ప్రతిభకు ఫిదా అవుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories