మురుగదాస్ – మహేష్ సినిమా మొదటి ఫోటో!

A.R. Murugadoss, A.R. Murugadoss Mahesh Movie First Photo, Murugadoss Mahesh Movie  First Still, Murugadoss Mahesh Movie Leaked Photoఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించబోతున్న సినిమా ముహూర్తపు షాట్ ని క్లిక్ మనిపించింది. ‘బ్రహ్మోత్సవం’ దారుణ పరాజయం తర్వాత తమ అభిమాన హీరో సినిమా ప్రారంభం కోసం వేచిచూసిన ప్రిన్స్ ఫ్యాన్స్ కు ఈ విషయం ఊరట కలిగిస్తోంది. దాదాపు రెండు నెలల క్రితం ప్రారంభం కావాల్సి ఉన్న ఈ సినిమా వాయిదాలు పడుతూ ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్ళడం విశేషం.

యధావిదిగా సెంటిమెంట్ పరంగా తన సినిమా తొలి రోజున ముహూర్తపు షాట్ కు మహేష్ హాజరు కాకపోగా, ప్రిన్స్ సతీమణి నమ్రత విచ్చేసి పూజా కార్యక్రమాలు జరిపారు. ఆగష్టు 1వ తేదీ నుండి సరికొత్త లుక్ తో ప్రిన్స్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారని సమాచారం. పూజా కార్యక్రమాలకు సంబంధించి తీసిన మొదటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. టైటిల్ ఖరారు కాని ఈ సినిమా ఎన్వీఆర్ సినిమా ప్రొడక్షన్ లో నిర్మితం కానుంది. ‘ఉరిమి’ ఫేం సంతోష్ శివన్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందివ్వడం మరో హైలైట్ గా కానుంది.

ADVERTISEMENT

గతంలో మహేష్ హీరోగా ఓ సినిమాకు దర్శకత్వం వహించాలని సంతోష్ శివన్ తీవ్రంగా ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రిన్స్ సినిమాకు ఫోటోగ్రఫీ అందించే బాధ్యతలు అందుకోవడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో ఒకే టైటిల్ ను ఖరారు చేయడానికి, ప్రస్తుతం చిత్ర యూనిట్ ఆలోచనలు చేస్తోంది. ప్రిన్స్ పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రీ లుక్ ను విడుదల చేయాలని భావిస్తుండడం అభిమానులను నూతన ఉత్సాహంలో ముంచెత్తుతోంది.

ADVERTISEMENT
Latest Stories