అమీర్ కొడుకుతో ఐష్ కూతురు స్టెప్పులు!

aaradhya-bachchan-azaad-rao-khan-danceప్రముఖ బాలీవుడ్ హీరో ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ అమీర్ ఖాన్ కొడుకు ఆజాద్ రావ్ ఖాన్, ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్య కలిసి ఒక పాటకు డ్యాన్స్ చేశారు. ముంబయిలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో వీళ్లిద్దరూ చదువుకుంటున్నారు. పాఠశాల వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘రైల్ గాడీ’ అనే పాటకు ఈ చిన్నారులిద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు.

ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోకి చేరి వైరల్ గా మారాయి. ఈ కార్యక్రమానికి ఆ పాఠశాల చైర్ పర్సన్ నీతా అంబానీ, ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ దంపతులు, అమీర్ ఖాన్ హాజరయ్యారు. చిన్నారుల ప్రదర్శన చూస్తూ చప్పట్లు కొడుతూ వారిని ప్రోత్సహించారు. ముద్దుముద్దుగా ఉన్న ఈ చిన్నారుల స్టెప్పుల వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories