నారా రోహిత్ సినిమాలంటే ప్రేక్షకులలో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా, కాస్త వినూత్నంగా సినిమాలను అందించడంలో సిద్దహస్తుడిగా, తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవడంలో రోహిత్ సక్సెస్ అయ్యాడు. కానీ ఆ క్రమంలో ప్రేక్షకుల సహనాన్ని కూడా పరీక్షిస్తున్నారన్న విషయం తాజాగా విడుదలైన “ఆటగాళ్ళు” వంటి సినిమాలు చాటిచెప్తున్నాయి.
[m9ad]
నారా రోహిత్ – జగపతిబాబులు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సినిమాకు ‘సింగిల్ టాక్’ వ్యక్తమవుతోంది, అదే ‘డివైడ్ టాక్.’ ధియేటర్ కు వెళ్ళిన ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడంలో ఈ సినిమా నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యిందన్న ‘ఫస్ట్ టాక్’ వెలువడింది. గతంలో ‘ఆంధ్రుడు’ వంటి సినిమాను అందించిన దర్శకుడు పరుచూరి మురళి, ఇలాంటి పేలవమైన సినిమాను అందిస్తారని సినీ జనాలు కూడా అంచనాలు వేయలేదు.
అసలే లో హైప్ లో రిలీజైన ఈ సినిమాకు పబ్లిసిటీ కూడా లేకపోగా, తాజాగా వెలువడిన డివైడ్ టాక్ సినిమాకు ఏ విధమైన ఫలితాన్ని అందిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా హీరోకు కావాల్సిన శరీర సౌష్టవాన్ని నారా రోహిత్ సినిమా సినిమాకు కోల్పోతుండడం, ఈ సినిమాలో కనిపించిన తీరుతో మరింత బలపడింది. ఫైనల్ గా చెప్పాలంటే… ఆటగాళ్ళ ఆటను ప్రేక్షకులు ఏ మాత్రం ఆస్వాదించలేకపోతున్నారు.



