మెగాస్టార్ కోసం హాలీవుడ్ నుండి దించుతున్నారు!

Action choreographer Tony Ching for Sye Raa Narasimha Reddyమెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా “సైరా నరసింహారెడ్డి” ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుందో, ఆ చిత్ర కాస్టింగ్ చెప్పకనే చెప్పింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ తారాగణంతో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషలలో కూడా రూపొందించనున్నారు. దాదాపుగా 200 కోట్ల భారీ వ్యయంతో కూడుకున్న ఈ ప్రాజెక్ట్ కున్న ప్రాధాన్యత రీత్యా, కేవలం నటీనటులనే కాక సాంకేతిక నిపుణులు కూడా అత్యున్నత స్థాయిలో ప్రతిభ కనపరిచిన వారినే ఎంపిక చేసుకుంటున్నారు.

ADVERTISEMENT

అందులో భాగంగా ఈ సినిమాలో పోరాట సన్నివేశాల కోసం స్టంట్ మాస్టర్ గా ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ టోనీ చింగ్ ను రంగంలోకి దించనున్నట్లుగా తెలుస్తోంది. ‘స్పైడర్ మ్యాన్’ వంటి పలు హాలీవుడ్ ప్రతిష్టాత్మక సినిమాలకు స్టంట్స్ నిర్వహించిన టోనీ, ఇండియాలో హృతిక్ రోషన్ “క్రిష్” మూవీకి పని చేసారు. ఆ సినిమాలో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ‘సైరా’లో స్టంట్స్ అదిరిపోయే రేంజ్ లోనే ఉండనున్నాయన్న మాట.

ADVERTISEMENT
Latest Stories