భావన కేసులో కీలకంగా మారిన వీడియోలు ఏమయ్యాయి?

Actress Bhavana Assault Videos Missingమలయాళ హీరోయిన్ భావనను కిడ్నాప్ చేసిన సమయంలో నిందితులు, పలు అసభ్యకర ఫోటోలను, వీడియోలను చిత్రీకరించిన విషయం తెలిసిందే. దీనిపై భావన తన ఎఫ్ఐఆర్ నివేదికలో స్పష్టం చేసింది. అయితే సునీల్ కుమార్ రెడ్డితో సహా కీలక నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆ వీడియోలను, ఫోటోలను బయటకు రాకుండా చూడాల్సిన బాధ్యత తలెత్తింది. ఈ లైంగిక వేధింపుల వీడియోల కోసం పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

విచారణలో భాగంగా సదరు నిందితుల నుండి ఈ వీడియోలు ఎక్కడున్నాయో అనే దానిపైనే పోలీసులు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. దాదాపు రెండున్నర్ర గంటల పాటు భావనను కారులో తిప్పుతూ దుండగులు వీడియోలు షూట్ చేసినట్లుగా ప్రాధమిక సమాచారం అందడంతో, ప్రస్తుతం వీటి భద్రత చాలా ముఖ్యంగా మారింది. అవి బయటకు వస్తే జరిగే ప్రమాదం మరింత ఎక్కువగా ఉన్నందున, ఎలాగైనా నిందితుల నుండి సదరు వీడియోల సమాచారాన్ని రప్పించే పనిలో పోలీసు వర్గాలు ఉన్నాయి.

ADVERTISEMENT

ఇక, ఈ కేసు వెనుక సునీల్ కుమార్ కాకుండా, మరికొందరు కీలక వ్యక్తులు ఉన్నారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఘటన జరిగిన నాలుగు రోజులు నిందితులు పోలీసులకు పట్టుబడకుండా దాక్కోవడం, ఆ తర్వాత ప్రధాన వ్యక్తి కోర్టు ముంగిట లొంగుబాటుకు ప్రయత్నించడంతో, సినీ పరిశ్రమలోని వారే ఆశ్రయం కల్పించారన్న అనుమానాలు బలపడ్డాయి. మరో వైపు రాజకీయ నాయకుల కుమారులకు కూడా ఈ ఘటనలో ప్రమేయముందంటూ వార్తలు వెలువడుతున్నాయి. బహుశా వీడియోలు దొరికితే అన్నింటికీ సమాధానం లభిస్తుందేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories