బాహుబలి’ ఓ పిచ్చి సినిమా… ‘శాతకర్ణి’ ఓ సూపర్ సినిమా..!

Actress Jamuna On Gautamiputra satakarni Vs Baahubaliబాక్సాఫీస్ వద్ద “బాహుబలి” కనకవర్షం కురిపిస్తున్న వేళ… ‘ఇదేం పిచ్చి సినిమా అంటూ’ సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి జమున, తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కేసారు. నాడు ‘బాహుబలి’ సినిమాను విమర్శించిన నోటితోనే, నేడు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. నందమూరి నటసింహం బాలకృష్ణతో కలిసి ప్రత్యేకంగా ఈ సినిమా ప్రదర్శనను వీక్షించిన జమున, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని ఆకాశానికేత్తేసారు.

తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమా ఒక తురుపు ముక్కగా మిగులుతుందని, శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించాడని కొనియాడుతూ… బాలయ్య నుదుటిపై ప్రేమగా ముద్దాడారు. 79 రోజుల్లో ఓ మంచి చిత్రాన్ని చక్కగా తీశాడని క్రిష్ ను అభినందిస్తూ, కమర్షియల్ అంశాల కోసం కథను దారి మళ్లించకుండా చక్కగా నడిపించారని పేర్కొన్నారు. ఈ తరం సినిమాలను సీనియర్ నటులంతా విమర్శలు చేస్తున్న వేళ, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకు మాత్రం అన్ని వైపుల నుండి అద్భుతమైన స్పందన రావడం విశేషం.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories