ఇందులో ఈ ‘బాబు’ సిద్ధహస్తుడు కదా!

Adhugo Movie Pre Teaserక్రియేటివిటీని ప్రదర్శించడంలో ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో స్టైల్ అయితే… రవిబాబు స్టైల్ మాత్రం హాలీవుడ్ పోకడకు దగ్గరగా ఉంటుందని చెప్పవచ్చు. వినూత్నమైన కధలను ఎంచుకోవడం, దానిని తనదైన శైలిలో ప్రజెంట్ చేయడం రవిబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్ని చిత్రాలు పరాజయం పాలైనా రొటీన్ కధలకు ఓటు వేయడం అనేది తెలియని రవిబాబు తాజాగా “అదుగో” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ADVERTISEMENT

పందిపిల్ల ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రమోషన్ ను కాస్త వెరైటీగా తన మార్క్ ను ప్రతిబింబిస్తూ విడుదల చేసారు రవిబాబు. పందిపిల్లతో ఓ సరదా సంభాషణను వీడియోగా చిత్రీకరించి విడుదల చేయగా, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించాడు రవిబాబు. ప్రయోగాలు చేయడంలో సిద్ధహస్తుడైన రవిబాబు, గతంలో అల్లరి నరేష్ తో ‘లడ్డూబాబు’ ప్రయోగం విఫలం అయిన దరిమిలా, మరోసారి ‘అదుగో’ సినిమాతో రాబోతున్నారు.

పూర్తి గ్రాఫిక్స్ తో కూడిన రాజమౌళి ‘ఈగ’ సినిమాను ఆదరించిన తెలుగు సినీ ప్రేక్షకులను తన ‘పందిపిల్ల’తో ఎలా ఆకట్టుకుంటాడో గానీ, రవిబాబు ప్రయోగాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. టాక్ తో నిమిత్తం లేకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానగణాన్ని సొంతం చేసుకున్న రవిబాబు, ఈ సారైనా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ధియేటర్లలోకి వస్తారేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories