ప్రభాస్ – అనుష్క… తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు..!

Again rumours on Anushka Shetty Prabhas Marriageయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజును అభిమానులు సోషల్ మీడియాలో అర్ధరాత్రి 12 గంటల నుండే జరుపుకుంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తోన్న దరిమిలా… బ్రేకింగ్ న్యూస్ అంటూ ఓ వ్యక్తి ప్రభాస్ పుట్టినరోజు గురించి ఓ వార్తను అందించారు. సినిమా విడుదలకు ముందు ‘సూపర్’ అంటూ ప్రతిసారి రివ్యూలు ఇచ్చే సదరు వ్యక్తి, ఇటీవల ప్రభాస్ – అనుష్కకు త్వరలోనే పెళ్లి జరగబోతోదంటూ సోషల్ మీడియాలో హంగామా చేసారు.

ADVERTISEMENT

తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఫాలోయర్స్ ను పెంచుకోవడానికి గానూ ఇలాంటి చీప్ పబ్లిసిటీలు చేయడం అలవాటుగా మారిన సదరు వ్యక్తి, తాజాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అనుష్క – ప్రభాస్ ల గురించి మరో వార్త రాసుకొచ్చారు. ఈ పుట్టినరోజును ‘లవ్ బర్డ్స్’ ఇద్దరూ ప్రభాస్ – అనుష్కలు కలిసి జరుపుకుంటున్నారని చెప్తూ… మరింత అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.

ఇప్పటికే చాలా సందర్భాలలో వీరిద్దరి రిలేషన్స్ పై చాలా వార్తలు పుట్టుకొచ్చాయి. అలాగే వివిధ సందర్భాలలో దీనిపై వీరిద్దరూ కూడా వివరణ ఇచ్చుకున్నారు. ఇటీవల మరోసారి ప్రభాస్ కూడా ఈ విషయాన్ని ఖండించారు. ఓ పక్కన ఇలా చెప్తున్నప్పటికీ, మరో పక్కన ‘తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు’ అన్న చందంగా సదరు వ్యక్తి వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో హంగామా చేయడంతో ‘యంగ్ రెబల్ స్టార్’ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories