ఒక్కోసారి అఫీషియల్ గా విడుదల చేసే పోస్టర్ల కన్నా అభిమానులు రూపొందించే పోస్టర్లు కావల్సినంత కిక్ ను పంచుతుంటాయి. ప్రస్తుతం ఓ అభిమాని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటో కూడా అంతేస్థాయిలో ‘మెగా’ అభిమానులకు కావల్సినంత ఎనర్జీని ఇస్తోంది. “అజ్ఞాతవాసి” విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఓ పోస్టర్ ను ఓ మెగా అభిమాని ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం అది వైరల్ అవుతూ హంగామా చేస్తోంది.
ఖుష్బూ వెనుక సీరియస్ గా నిల్చున్న పవన్ కళ్యాణ్ పోస్టర్ ను పబ్లిసిటీలో భాగంగా విడుదల చేయగా, ఖుష్భూ స్థానంలో మెగాస్టార్ చిరంజీవిని కూర్చోబెట్టి సదరు పోస్టర్ ను ఎడిట్ చేసారు. ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలోని చిరు స్టిల్ ఈ ‘అజ్ఞాతవాసి’కి సరిగ్గా సరిపోయింది. నిజంగా ఓ మల్టీస్టారర్ సినిమా పోస్టర్ కూడా ఇంత పర్ ఫెక్ట్ గా సెట్ అవుతుందో లేదో గానీ, ఈ మెగా బ్రదర్స్ పోస్టర్ అదిరిపోయిందని చెప్పొచ్చు. చిరుకు వెనుక ఎప్పుడూ పవన్ రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటారు గనుక ఈ పోస్టర్ కు రెస్పాన్స్ ఆ రేంజ్ లో వస్తోంది.



