యలహంక రహస్యాలు బయటకు పొక్కకూడదనే…

YS Sharmila-Jagan Dispute: Anjili's Wedding Venue Changed

ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగలూరులోని యలహంక ప్యాలస్‌లో తన కుమార్తె అంజిలి వివాహం చేయాలనుకున్నారు. కానీ ఆమె సోదరుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన భద్రత కోసం అక్కడ వివాహానికి అనుమతించలేదు.

ఆస్తుల కోసం గొడవపడుతూ, రాజకీయంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తునందునే జగన్‌ ఆమెకు షాక్ ఇచ్చారనే వాదనలు వినిపించాయి.

ADVERTISEMENT

అయితే ఆ కారణంగా జగన్‌ సొంత మేనకోడలు పెళ్ళికి ఈవిధంగా ఆటంకాలు సృష్టించడం సరికాదని విమర్శలు కూడా వచ్చాయి.

‘అమ్మకు అన్నం పెట్టనివాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్లు’, సొంత చెల్లిని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్న జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేస్తానంటే ఎలా నమ్మగలమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఈ వివాహానికి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో సహా పలువురు జగన్‌, వైసీపీ రాజకీయ ప్రత్యర్ధులను కూడా వైఎస్ షర్మిల ఆహ్వానించారు.

కనుక వారందరూ, వారితో పాటు మీడియా ప్రతినిధులు యలహంక ప్యాలస్‌లో జరిగే ఈ పెళ్ళికి హాజరయితే, ఇంత కాలం రహస్యంగా దాచి పెట్టిన ఆ అత్యంత విలాసవంతమైన ప్యాలస్‌ ఫోటోలు బయటకు వచ్చేస్తాయి. దానిలో జగన్‌ ఏర్పాటు చేసుకున్న రాజవైభోగాల గురించి బయట ప్రపంచానికి తెలిసిపోతుంది. ముఖ్యంగా సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌కు, వారి పార్టీల నేతలకు వాటి గురించి తెలిసి పోతుంది. ప్యాలస్‌ లోపలి ఫోటోలు, వీడియోలు వారి చేతికి కూడా వచ్చేస్తాయి. అప్పుడు వారు అవకాశం చిక్కినప్పుడల్లా ‘యలహంక ప్యాలస్‌’ గురించి మాట్లాడుతూ, జగన్‌ని నిలదీస్తూనే ఉంటారు.

ఇప్పటికే విశాఖలో రుషికొండపై కట్టుకున్న ‘శాంపుల్ ప్యాలస్‌’లో వైభోగం గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇకపై యలహంక ప్యాలస్‌.. దానిలో జగన్‌ విలాసవంతమైన జీవనం గురించి మరిన్ని కొత్త కథలు మొదలవుతాయి. వాటి గురించి మీడియా కథలు, కథలుగా చెబుతూనే ఉంటుంది.

బహుశః అందుకే జగన్‌ భద్రతా కారణాల వంకతో యలహంక ప్యాలస్‌లో మేనకోడలి పెళ్ళిని అడ్డుకున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ అసలు కారణం ఇదే అయ్యుండవచ్చు. ఎందుకంటే ఇంటి గుట్టు లంకకు చేటు కదా?

ఈ వివాదంపై వైఎస్ షర్మిల స్పందిస్తూ, “నాది కానీ దాని కోసం ఆశపడే నీచత్వం నాది కాదు జగన్ మోహన్ రెడ్డి గారు,” అంటూ ‘ఎక్స్‌’లో ఓ పెద్ద పోస్ట్ పెట్టారు. కూతురు పెళ్ళిలో ఇలాంటి వివాదాలు వద్దనుకుని వేరే చోట చేసుకుంటున్నామని దానిలో పేర్కొన్నారు. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే….

Latest Stories