హవ్వ … ఇసుక కొరత వల్ల ఎయిమ్స్ ఆగిపోయిందంట

AIIMS Mangalagiri construction halted due to lack of sandపార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. విభజన హామీలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మంగళగిరికి ప్రతిష్టాత్మకరమైన ఎయిమ్స్ ని ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే 2019 తరువాత దీని నిర్మాణం అనూహ్యంగా నెమ్మదించింది. ఇదే విషయాన్ని పార్లమెంట్ లో మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి లేవనెత్తారు.

ADVERTISEMENT

దానికి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్‌ చౌబే లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. “మంగళగిరి ఎయిమ్స్‌ నిర్మాణం ఇప్పుడు పురోగతిలో ఉంది. మొదట్లో ఇసుక సమస్య కారణంగా దీని నిర్మాణంలో కొంత జాప్యం జరిగింది. అంతకుముందు డ్రెయిన్‌, రహదారి నిర్మాణం, అక్కడున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ క్యాంపస్‌ను మార్చడం లాంటి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వపరంగా కొంత ఆలస్యం జరిగింది. దీనికితోడు కొవిడ్‌ కూడా ప్రభావం చూపింది’’ అని తెలిపారు.

“ఒక ప్రతిష్టాత్మక కేంద్ర ప్రాజెక్ట్ కు ఇసుక కొరత అంటే ఏం చెప్పుకోవాలి? అటువంటి ప్రాజెక్ట్ కే ఇసుక దొరక్కపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో? ఇసుక వంటి చిన్న సమస్య పరిష్కరించలేని ప్రభుత్వం ఎందుకు? చరిత్రలో ఇంత అసమర్ధ ప్రభుత్వాన్ని ఇప్పటివరకూ చూడలేదు,” అని బీజేపీ వారు విమర్శిస్తున్నారు.

ఇసుక మాఫియా అంటూ జగన్ ప్రభుత్వం కొలువుదీరాకా అనేక మార్లు ఇసుక పాలసీని మార్చింది. దాని వల్ల సామాన్యులకు ఇసుక దొరకడమే గగనం అయ్యింది. రేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి. ఎందుకనో ఎన్ని మార్లు పాలసీ మార్పు చేసినా ఇసుక సమస్య మాత్రం ఎందుకనో తీరడం లేదు.

ADVERTISEMENT
Latest Stories