రణబీర్ తో రొమాన్స్ పై పెదవి విప్పిన ఐష్!

Aishwarya Rai responds ranbir kapoor romance‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాలో రణబీర్ – ఐశ్వర్యారాయ్ ల మధ్య హాట్ హాట్ సన్నివేశాలు హాట్ టాపిక్ కావడంతో, ఈ సినిమాకు ఆశించిన దాని కంటే ఎక్కువ ప్రచారమే లభించింది. బాలీవుడ్ లో చర్చనీయాంశమైన ఈ సంగతులు ఎక్కడివరకు చేరిందంటే… అభిషేక్ తో బంధంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ హాట్ సీన్లపై ఇప్పటివరకు స్పందించని ఐశ్వర్యారాయ్ తొలిసారిగా పెదవి విప్పి… తానూ పరిధి దాటి నటించలేదని పేర్కొంది.

ADVERTISEMENT

దర్శకుడి సలహా మేరకు ఈ సినిమాలో హుందాగా నటించానని, ఈ సినిమాలో తన పాత్ర చాలా బాగుంటుందని చెప్పింది. రణబీర్ కపూర్ తో తాను నటించిన దృశ్యాలు అసభ్యకరంగా ఉండవని, కళాత్మకంగా ఉంటాయని వెల్లడించింది. అలాగే ఈ సినిమాలో ఐశ్వర్య తన పాత్ర ప్రాముఖ్యతను అర్థం చేసుకుని, అద్భుతంగా నటించిందని, ఈ సినిమాలో స్కిన్ షో లేదా లిప్ లాక్ సన్నివేశాలు లేవని స్పష్టం దర్శకుడు కరణ్ జోహార్ కూడా స్పష్టం చేసారు. మరి ఏమీ లేకుండా ఈ హాట్ సన్నివేశాలు ఎలా పుట్టుకొచ్చినట్టు? అని తెల్లముఖం వేయడం నెటిజన్ల వంతవుతోంది.

ADVERTISEMENT
Latest Stories