అఖండ రిలీజ్ ఆగినా… బాలయ్య గౌరవం గెలిచింది

Akhanda 2 postponed due to financial dispute causing controversy around Balakrishna

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల కావలసి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఆర్ధిక లావాదేవాలలో ఏర్పడిన ఓ వివాదం కారణంగా అఖండ-2 వాయిదా పడినట్లు సమాచారం. బాలయ్య సినిమా వాయిదా పడిందనగానే పైశాచిక ఆనందంతో కొందరు పండగ చేసుకుంటున్నారు.

సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు వాగుతున్నారు. ఆర్ధిక లావాదేవీల విషయంలో బాలయ్యని తప్పు పడుతూ విమర్శిస్తున్నారు.

ADVERTISEMENT

కానీ ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరైన బాలయ్యబాబు ఆర్ధిక లావాదేవీలలో కక్కుర్తి పడతారా? తప్పులు చేస్తారా? అంటే కాదని అందరికీ తెలుసు. కనుక ఆర్ధిక వివాదంలో న్యాయస్థానం బాలయ్య తప్పు చేశారని చెపితే తప్ప ఆయనని తప్పు పట్టడం తొందరపాటే అవుతుంది.

ఇక మరో విషయం ఏమిటంటే, బాలయ్య బాబు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి వియ్యంకుడు. కనుక ఆయన తలుచుకుంటే ప్రభుత్వపరంగా ఒత్తిడి చేయించి అఖండ-2కి ఏర్పడిన ఆటంకాలను తొలగించుకోగలరు. కానీ అయన తన సినిమా కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడాలనుకోలేదు. అందువల్లే అఖండ-2 ఆగిపోయింది. ఈ వివాదం విషయంలో బాలయ్యని తప్పు పడుతున్నవారు, అవహేళన చేస్తున్నవారు ఈ విషయం గమనిస్తే బాగుంటుంది.

దీని వలన తాత్కాలికంగా అందరూ ఆయనని వేలెత్తి చూపి విమర్శించవచ్చు. సినిమా రిలీజ్ రోజున వాయిదా పడటం వలన నిర్మాణ సంస్థలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టం కలగవచ్చు. ఇంకా అనేక ఒత్తిళ్ళు, అప్రదిష్ట కలగవచ్చు. కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories