ఫ్యాన్స్ హర్ట్… ఏంటి మరీ ఇంత సింపుల్ గానా..!?

గాలి జనార్ధన్ రెడ్డి పంచిన ఆహ్వాన పత్రికల తర్వాత… ఏ ఇన్విటేషన్ కార్డు వచ్చినా దానితో పోల్చి చూడడం షరామామూలు అయిపోయింది. అందులోనూ ‘కింగ్’ నాగార్జున కొడుకు అఖిల్ నిశ్చయ తాంబూలం ఆహ్వానపత్రిక అంటే ఎలా ఉండాలి? చూడగానే మతిపోయేలా ఉండాలంటారు మాస్ ఆడియన్స్. ఫస్ట్ లుక్ లో ఫిదా అయిపోవాలంటారు క్లాస్ ప్రేక్షకులు. మరి ఇంతకీ అఖిల్ ఎంగేజ్మెంట్ కార్డ్ ఎలా ఉంది? అంటే అక్కినేని అభిమానులు నిట్టూర్పును ప్రదర్శించేలా ఉందని చెప్పాలి.

నాగార్జున, అఖిల్ ల అభిలాషకు తగిన విధంగా చాలా సింపుల్ గా కనపడుతోంది ఈ ఆహ్వాన పత్రిక. చూడడానికి క్లాసీ లుక్ లో చక్కటి డిజైన్ తో కూడిన కార్డు ఇంత సింపుల్ గా ఉండడంతో అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఇది నిశ్చయ తాంబూల పత్రిక మాత్రమే కావడంతో, అసలుదైన వెడ్డింగ్ కార్డ్ అదిరిపోవాలి అంటున్నారు అక్కినేని అభిమానులు. ఆర్ధికంగా నాగార్జున అందరి హీరోలను మించిన స్థాయిలోనే ఉండడంతో, ఆ రేంజ్ లోనే వివాహం కూడా జరగాలని అభిమానుల ఆకాంక్ష.

ADVERTISEMENT

akhil-akkineni-simple-wedding-card-talk

ADVERTISEMENT
Latest Stories