పార్టీ చేసుకుంటున్న “అక్కినేని” యువ జంటలు!

Akhil Naga Chaitanya Samantha Shriya Couples Party Togetherఏదైనా అధికారికం కానంత వరకు ఉన్న మజా, ఒక్కసారి అఫీషియల్ గా డిక్లేర్ చేసిన తర్వాత ఉండేదేమో గానీ, ఇటీవల కాలంలో చైతూ, సమంతల జోడి హంగామా తగ్గింది. అంతకు ముందు కాఫీ షాప్స్ లో, షాపింగ్ మాల్స్ లో, మేడ పైన, మిద్దె పైన అంటూ తెగ హంగామా చేసిన ఈ జంట, ప్రస్తుతం చాలా అరుదుగా దర్శనమిస్తున్నారు. ‘ప్రేమమ్’ విడుదల తర్వాత పబ్ లో కాసేపు హంగామా తర్వాత, తాజాగా ‘అక్కినేని బ్రదర్స్’ ఇద్దరూ కలిసి వారి వారి ప్రియురాళ్ళతో పండగ చేసుకుంటున్నారు.

చైతూ – సమంత, అఖిల్ – శ్రియా… నలుగురు కలిసి కాసేపు వీకెండ్ ముచ్చట్లు చెప్పుకుంటున్నట్లుగా కనపడుతోంది. దీంతో అక్కినేని యువ జంటల ఫోటో సోషల్ మీడియాలో యధావిధిగా హంగామా చేస్తోంది. అంతకు ముందు విడివిడిగా చేసుకునే వారు కాస్త, ఇపుడు అధికారికం కావడంతో కలిసి కట్టుగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. ఏది ఏమైనా ఈ అక్కినేని బ్రదర్స్ మధ్య బాంధవ్యం కాస్త గట్టిగానే ఉన్నట్లుంది. ఇదే సంబంధాలను పెళ్ళయిన తర్వాత కూడా మైంటైన్ చేస్తే… అది కదా గ్రేట్ అంటున్నారు నెటిజన్లు..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories