‘అఖిల్’ రెండవ సినిమాకు ‘ఊపిరి’ పోయనున్న దర్శకుడు!

vamsi paidipally nagarjuna oopiriతొలి సినిమాతోనే భారీ సక్సెస్ ఆశించిన అక్కినేని నటవారసుడు అఖిల్ కు తెలుగు ప్రేక్షకులు షాకిచ్చారు. భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమా అట్టర్ ప్లాప్ గా మిగిలిపోయింది. దీంతో అఖిల్ నటించబోయే రెండవ సినిమాపై ‘కింగ్’ నాగార్జున పలు జాగ్రత్తలు తీసుకొంటున్నారని ట్రేడ్ వర్గాల టాక్.

ప్రస్తుతం “సోగ్గాడే చిన్నినాయనా” చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నాగ్, అఖిల్ నటించబోయే రెండవ సినిమాకు దర్శకుడిని ఫైనల్ చేసారని తెలుస్తోంది. “సోగ్గాడే చిన్నినాయనా” తర్వాత నాగ్ నటిస్తున్న “ఊపిరి” చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి పనితీరుకు ‘కింగ్’ ఫ్లాట్ అయ్యారని, అఖిల్ రెండవ సినిమాకు “ఊపిరి” పోసేది వంశీనేనని సమాచారం.

ఇటీవల కాలంలో పలు బాలీవుడ్ సినిమాలను రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు హల్చల్ చేసిన నేపధ్యంలో వంశీ దర్శకత్వంలో తెరకేక్కబోయే చిత్రం రీమేక్ చిత్రమా? లేక ఫ్రెష్ కధంశామా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం వంశీ దర్శకత్వం వహిస్తున్న “ఊపిరి” సినిమా రీమేక్ కావడంతో, అఖిల్ తో తీయబోయే సినిమా కూడా రీమేక్ అయ్యి ఉండవచ్చని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ADVERTISEMENT
Latest Stories